Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej : మీతో కలిసి సినిమా చూడటం కుదరలేదు.. సాయి ధరమ్ తేజ్ ఆడియో మెసేజ్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఇటీవలే పూర్తిగా కోలుకున్నాడు. కొద్దీ రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే.

Sai Dharam Tej : మీతో కలిసి సినిమా చూడటం కుదరలేదు.. సాయి ధరమ్ తేజ్ ఆడియో మెసేజ్..
Tej
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2021 | 9:08 PM

Sai Dharam Tej  : రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఇటీవలే పూర్తిగా కోలుకున్నాడు. కొద్దీ రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవలే దీపావళి పండగ రోజున తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు చిరు. తేజ్ కోలుకోవడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఇప్పటికే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇక రిపబ్లిక్ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానున్న నేపథ్యంలో తేజ్ ఓ ఆడియో మెసేజ్‌ను విడుదల చేశారు.  ఈ ఆడియోకు ముందు రిపబ్లిక్ సినిమాలోని ఓ సీన్‌ను జోడించారు. అనంతరం సాయితేజ్ ఆడియో ఉంది. నా పై మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు.. రిపబ్లిక్ సినిమాను థియేటర్‌లో మీతో కలిసి చూడటం కుదరలేదు, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందని పేర్కొన్నారు. అందరు సినిమాను చూసి స్పందించాలని కోరారు తేజ్. చివరిలో జై హింద్ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu-Rajamouli: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ చేతికి మహేష్ -రాజమౌళి ప్రాజెక్ట్..

Manchi Rojulochaie: ఓటీటీలో సందడి చేయనున్న మంచి రోజులు వచ్చాయి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Raj Tarun: అందుకే వెబ్ సిరీస్ చేయలేదు.. అసలు విషయం చెప్పిన యంగ్ హీరో రాజ్ తరుణ్..