AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun: అందుకే వెబ్ సిరీస్ చేయలేదు.. అసలు విషయం చెప్పిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా.

Raj Tarun: అందుకే వెబ్ సిరీస్ చేయలేదు.. అసలు విషయం చెప్పిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
Raj Tharun
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2021 | 8:16 PM

Share

Raj Tarun: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో రాజ్ తరుణ్  బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ..ఈ సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను. నా సినిమాలు దాదాపు భీమవరంలోనే చేశాను. అక్కడంతా తెలిసిన వాళ్లే ఉన్నారు. ఈ పాత్ర చాలా కొత్తది. ఇంతకు ముందు చేసిన వాటితో పోల్చుకుంటే ఇంకాస్త హైపర్‌గా ఉంటుంది అన్నారు.

సినిమాలోని పాత్రకు నా నిజ జీవితానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అనుభవించు రాజాలో ప్రకృతి, వికృతి రెండూ ఉంటాయి అన్నారు. అలాగే సెక్యూరిటీ గార్డ్ అవ్వాలంటే వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందా? అనేది చూశానే. సెక్యూరిటీ గార్డ్ అంటే అంత ఈజీ కాదని తెలిసింది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చూసే ఫస్ట్ మొహం, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు చూసే చివరి మొహం సెక్యూరిటీ గార్డ్‌దే. వాళ్లు ఒక్క చిరు నవ్వుతో తలుపు తీస్తే మనకు బాగుంటుంది. అదే చిరగ్గా తీశారంటే రోజంతా కూడా మన మూడ్ అలానే అవుతుంది అన్నారు. భీమవారం స్లాంగ్, అక్కడి పాత్రలు నాకు బాగా సూట్ అవుతాయి. వాటిలో నేను సులభంగా ఇమడగలను. కొత్త పాత్రలు ట్రై చేశాను. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఈ చిత్రంలో భీమవరం, హైద్రాబాద్ నేపథ్యంలో సాగుతుంది అని రాజ్ తరుణ్ అన్నారు. నాగ చైతన్య గారు ఈ సినిమా చూశారు. ఆయన చూసినప్పుడు నేను అక్కడ లేను. వేరే షూటింగ్‌లో ఉన్నాను. సినిమా చూశాక డైరెక్టర్‌తో నలభై నిమిషాలు మాట్లాడారట. సినిమా చాలా నచ్చిందని అన్నారట.ఓ వెబ్ సిరీస్ చాన్స్ వచ్చింది. నాకు చాలా నచ్చింది. కానీ రెండు సినిమా షూటింగ్‌లు చేస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఇక్కడ ఓ సినిమా హిట్ కొట్టిన తరువాత వేరే భాషలో ట్రై చేస్తాను అన్నారు రాజ్ తరుణ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood : ఆ హీరోల సినిమాలకు బిగ్ షాక్.. టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న ప్రభుత్వ నిర్ణయం.

Actor Uttej : ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇప్పుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్..

Disha Patani: బర్త్ డే పార్టీలో టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేసిన దిశా సోదరి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..