Food for Healthy skin: ఆహారంతో మొటిమలు మచ్చలను దూరం చేయండిలా.. ఫ్రూట్‌ ఫేస్‌ ప్యాక్స్‌తో మంచి ఫలితం..(వీడియో)

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Nov 25, 2021 | 9:11 AM

యుక్తవయసు రాగానే మొటిమలు రావడం మొదలవుతుంది. మొటిమలు లేని చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ తరచూ మొటిమలతో పాటు వాటివల్ల ఏర్పడే మచ్చలు, పిగ్మెంటేషన్‌ మొదలైన వాటితో ఇబ్బంది పడుతుంటారు.


యుక్తవయసు రాగానే మొటిమలు రావడం మొదలవుతుంది. మొటిమలు లేని చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ తరచూ మొటిమలతో పాటు వాటివల్ల ఏర్పడే మచ్చలు, పిగ్మెంటేషన్‌ మొదలైన వాటితో ఇబ్బంది పడుతుంటారు. మచ్చలేని చర్మం కావాలంటే మాత్రం, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. చర్మానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవాలి .పిగ్మెంటేషన్‌ సమస్యకు చెక్‌ పెట్టాలంటే
చర్మంలోని మెలానిన్‌ అనే పదార్థానికి పిగ్మెంట్‌ పవర్‌ కోసం క్యాబేజీ, పాలకూర, ఆకుపచ్చని కూరగాయలు తినాలి.

దానిమ్మ, బొప్పాయి, స్ట్రాబెర్రీ, నారింజ మొదలైన పండ్లు చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్నే కాదు, గుండె జబ్బులనూ దూరం చేస్తాయి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నివారిస్తాయి. పెరుగులోని క్యాల్షియం ఇంకా ప్రొటీన్‌, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. జీర్ణ వ్యవస్థ బాగుంటే చర్మ ఆరోగ్యంపైన ప్రభావం చూపుతుంది. మొటిమలు మచ్చలను దూరం చేస్తుంది.
శరీరానికి సరిపడా నీళ్లు అందితేనే, ముఖం మృదువుగా, మెరుపుతో కనిపిస్తుంది. వ్యాయామంలో చెమట రూపంలో మలినాలన్నీ బయటికి పోవడంవల్ల కూడా చర్మం బాగుంటుంది. శరీరం మొత్తానికి పోషకాలు, ఆక్సిజన్‌ తీసుకెళ్లేది నీళ్లే. ముఖ్యంగా, మొటిమలు ఏర్పడకుండా నీళ్లు అడ్డుకుంటాయి.

ఇక పళ్ళ గుజ్జును ప్యాక్‌లా మొహానికి అప్లయ్‌ చేయడం వల్ల ఎన్నో లాభాలను మనం చూస్తాం. యాపిల్‌లోని పెక్టిన్‌ అనే పదార్థం మొటిమలతో పోరాడుతుంది. పెరుగులోని యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తాయి. నిమ్మరసం శరీరంలోని మలినాలను బయటికి పంపి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పుచ్చకాయలోని విటమిన్‌-ఎ,బి,సి చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా చేస్తాయి. ముఖంపై మొటిమలు, మచ్చలను దూరం చేస్తాయి. అవకాడోలోని విటమిన్‌-ఇ చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేస్తుంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu