Shahid Kapoor: సినిమా కోసం బిచ్చగాడిలా ప్రతి ఒక్కరిని అడుక్కున్నాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్..

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో షాహిద్ కపూర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన షాహిద్‏కు బ్రేక్ మాత్రం రాలేదు.

Shahid Kapoor: సినిమా కోసం బిచ్చగాడిలా ప్రతి ఒక్కరిని అడుక్కున్నాను.. సంచలన వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్..
Shahid Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 25, 2021 | 8:54 AM

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో షాహిద్ కపూర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన షాహిద్‏కు బ్రేక్ మాత్రం రాలేదు. చాలా కాలంగా షాహిద్ బ్లాక్ బస్టర్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఉడ్తా పంజాబ్, కబీర్ సింగ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు షాహిద్. ఎప్పుడు విభిన్న ప్రయోగాలు చేస్తూ.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకోవడం షాహిద్ స్టైల్. కబీర్ సింగ్ సినిమాతో షాహిద్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా సరైన హిట్టు కోసం చూస్తున్న ఈ హీరో ఉడ్తా పంజాబ్, కబీర్ సింగ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.

తాజాగా షాహిద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం జెర్సీ. తెలుగులో నాని నటించిన జెర్సీ సినిమాను హిందీ రీమేక్ ఇది. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు షాహిద్… “నేను కబీర్ సింగ్ విడుదలైన తర్వాత కొంతమంది నిర్మాతల దగ్గరకు రోజూ వెళ్లాను.. వారంతా 200-250 కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మించే పెద్ద నిర్మాతలు. గతంలో నేను ఎలాంటి భారీ బడ్జెట్ క్లబ్ లోకి చేరలేదని… కానీ ప్రస్తుతం జెర్సీతో ఆ ఫీట్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీకి వచ్చి 15-16 ఏళ్లు అవుతున్నా .. భారీ బడ్జెట్ మూవీ చేయలేదు.. చివరికి ఇలా సాధ్యమైంది” అంటూ చెప్పుకొచ్చాడు షాహిద్. ఇది ఎక్కడివరకు వెళ్తుందనే విషయం తెలియదని.. కానీ చాలా కొత్తగా ఉందని తెలిపాడు. ఇక జెర్సీ సినిమా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహించారు.

Also Read: Dance Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆయన కొడుకుకు కూడా..

Drishyam 2 Twitter Review: దృశ్యం 2 ట్విట్టర్ రివ్యూ.. ఊహించని ట్విస్టులతో అదిరిపోయిందంటున్న నెటిజన్స్..

Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..