Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stomach Pain Relief Tips: కడుపు నొప్పి వేధిస్తుంటే ఇలా చేయండి.. క్షణాల్లో ఉపశమనం..

సీజన్స్ మారుతున్న సమయంలో అనారోగ్య సమస్యలు కూడా మరింత పెరుగుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో జలుబు,

Stomach Pain Relief Tips: కడుపు నొప్పి వేధిస్తుంటే ఇలా చేయండి.. క్షణాల్లో ఉపశమనం..
Stomach Pain
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 25, 2021 | 7:29 AM

సీజన్స్ మారుతున్న సమయంలో అనారోగ్య సమస్యలు కూడా మరింత పెరుగుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పు, కడుపు నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ముఖ్యంగా చలికాలంలో కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలు ఎక్కువే. ఉష్ణోగ్రతలు పడిపోవడం.. శరీరం చలికి గురవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతోపాటు.. అలసట, నీరసం కలుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఈ సీజన్లో కడుపులో హఠాత్తుగా నొప్పి వచ్చినా.. లేదా ప్రతిసారి తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న కొన్ని ఇంటి నివారణ పద్ధతులను అనుసరించండి. అవెంటో తెలుసుకుందామా.

చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరానికి వెచ్చదనం అందించేందుకు కేలరీలు ఎక్కువగా అవసరమవుతాయి. దీని వలన జీర్ణవ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది. చలికాలంలో జీర్ణవ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కడుపులో నొప్పి పడుతుంది.

కడుపునొప్పి నివారణకు మెంతులు మేలు చేస్తాయి. మెంతులను గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి. కడుపులో గ్యాస్ సమస్య నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు నొప్పి తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తిన్న తర్వాత.. దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి తీసుకోవాలి. కడుపు నొప్పి సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. కడుపులో జలుబు తగ్గాలంటే జీలకర్ర, కొత్తిమీర, మెంతి, కారం, మెంతి కూరలను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకోవాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Also Read: Bigg Boss 5 Telugu: ఇట్స్ ఫ్యామిలీ టైం.. బిగ్‏బాస్ ఇంట్లో కాజల్ కూతురు సందడి..

Dance Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆయన కొడుకుకు కూడా..

Aamir Khan: కేజీఎఫ్ 2 దర్శక నిర్మాతలకు క్షమాపణలు చెప్పిన ఆమిర్‌ ఖాన్‌.. ఎందుకంటే.