Kidney Disease: కిడ్నీ వ్యాధుల రోగులు పెరుగుతున్నారు..! లక్షణాలు వెంటనే గుర్తించండి..

Kidney Disease: కొంతకాలంగా దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు , నిద్రలేమి తదితర కారణాల వల్ల ఈ సమస్య

Kidney Disease: కిడ్నీ వ్యాధుల రోగులు పెరుగుతున్నారు..! లక్షణాలు వెంటనే గుర్తించండి..
Kidney
Follow us
uppula Raju

|

Updated on: Nov 24, 2021 | 10:09 PM

Kidney Disease: కొంతకాలంగా దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు , నిద్రలేమి తదితర కారణాల వల్ల ఈ సమస్య పెరుగుతోంది. దీంతో ఆసుపత్రుల్లో కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్న రోగులు కూడా పెరుగుతున్నారు. మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన లక్షణాలపై ప్రజలు శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. యువత ఎక్కువగా దీని భారిన పడుతున్నారు. అయితే నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు చాలా కాలం క్రితమే శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. కానీ ప్రజలు వాటిని పట్టించుకోరు. దీని కారణంగా చాలా మంది రోగులకు కిడ్నీలు ఫెయిల్‌ అవుతాయి. అటువంటి సందర్భాలలో కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది.

ప్రారంభంలోనే లక్షణాలు కనిపిస్తాయి కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు మొదట్లోనే కనిపిస్తాయి. మూత్రపిండము ఆరోగ్యంగా ఉందా లేదా అనేది మూత్రం ద్వారానే తెలుస్తుంది. మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం లేదా మూత్రం రంగు మారడం సంకేతాలు. ఇది క్రమంగా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. చాలా సార్లు రోగులు కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపించిన తర్వాత కూడా చికిత్స పొందడంలో ఆలస్యం చేస్తారు. ఇంటి నివారణలపై ఆధారపడతారు. దీంతో వ్యాధి తీవ్రమవుతుంది.

ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు 1. తరచుగా మూత్ర విసర్జన 2. పొత్తికడుపులో నొప్పి 3. వాంతులు అవ్వడం 4. వికారం కలగడం 5. నీరసం, అలసిపోవడం

ఆరోగ్యమైన కిడ్నీల కోసం జీవనశైలిలో మార్పులు 1. ఆహారం మీద దృష్టి 2. కిడ్నీ ఫెయిల్యూర్‌కు సంబంధించిన లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం 3. రక్తపోటు, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం 4. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం 5. కనీసం సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవడం

అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?

Navy MR Admit Card 2021: ఇండియన్‌ నేవీ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Jiophone Next: జియో ఫోన్‌ విక్రయాలు ప్రారంభం.. ధర, ఆఫర్‌లు ఏ విధంగా ఉన్నాయంటే..?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?