అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?

Eating Food: ఒక మనిషి బతకాలంటే ఆహారం చాలా ముఖ్యమైనది. లేదంటే మనిషి నీరసించిపోతాడు. కొన్ని రోజులు అలాగే ఉంటే మరణిస్తాడు. ఆహారానికి సంబంధించి

అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?
Food

Eating Food: ఒక మనిషి బతకాలంటే ఆహారం చాలా ముఖ్యమైనది. లేదంటే మనిషి నీరసించిపోతాడు. కొన్ని రోజులు అలాగే ఉంటే మరణిస్తాడు. ఆహారానికి సంబంధించి హిందూ మతంలో అనేక నియమాలు చెప్పారు. ఆహారం ఎలా తినాలి? భోజనం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటి? ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే విషయాల గురించి ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ ఆహార నియమాలను తెలుసుకోవడం అవసరం. పురాణ గ్రంథాలలో ఆహారం తినడానికి సంబంధించి కొన్ని నియమాలు పేర్కొన్నారు.

సనాతన ధర్మంలో ఆహారం తీసుకునే ముందు మూడుసార్లు నీళ్లు చల్లుకునే సంప్రదాయం ఉంది. ఈ విధంగా ఆహార దేవతను ప్రసన్నం చేసుకొని తర్వాత తినడం ప్రారంభిస్తారు. అంతేకాదు అన్నం నేలపై కూర్చొని అరటి ఆకులో తినేవారు. అంతేకాదు స్వచ్ఛమైన ప్రదేశంలో ఆహారాన్ని తయారు చేయాలని మన పురాణ గ్రంథాలలో చెప్పారు. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రదేశంలో తయారుచేసిన ఆహారంలోనే తాజాదనం ఉంటుందని విశ్వసించేవారు. ప్రతి అమ్మాయి లేదా స్త్రీ ఆహారాన్ని వండితే జీవితంలో సానుకూలత, ఆనందం, అభివృద్ధి ఉంటుందని పేర్కొన్నారు.

ఇది మాత్రమే కాదు హిందువుల విశ్వాసం ప్రకారం.. ఆహారాన్ని మొదట అగ్ని దేవునికి అంకితం చేస్తారు. ఇది కాకుండా ఆహారం తీసుకునే ముందు ఒక మంత్రాన్ని జపిస్తారు. ఇది అన్ని దేవతలను సంతోషపరుస్తుందని నమ్మకం. ఎవరైనా ఇంటికి అతిథి వచ్చినట్లయితే అతడి ఆహారం తీర్చడం బాధ్యత. ఇంట్లో సరుకులు ఉన్నా లేకున్నా అతిథికి తాజా ఆహారాన్ని వడ్డించాలనే నియమం ఉంది. తినే సమయంలో ఆహారాన్ని ఎప్పుడు అసహ్యించుకోకూడదు. అది ఎంత చెత్తగా తయారు చేసినా ఆ ఆహారాన్ని భగవంతుని నైవేద్యంగా తినాలి. అలా చేయడం వల్ల జీవితంలో చాలా సానుకూల ప్రభావాలు ఉంటాయని పురాణాలలో చెప్పారు.

గమనిక- ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని గమనించి రాయడం జరిగింది.

Viral Video: పిల్లి పిల్లపై విరుచుకుపడిన మూడు పులులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Winter Foods: శీతాకాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ ఫైబర్‌ ఆహారాలు కచ్చితంగా తినాలి..!

National Symbols: భారత జాతీయ చిహ్నాలు.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు..

 

Click on your DTH Provider to Add TV9 Telugu