AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిల్లి పిల్లపై విరుచుకుపడిన మూడు పులులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Viral Video: సాధారణంగా ప్రజలు పులులను పెంచుకోరు కానీ పిల్లులను పెంచుకుంటారు. కారణం పిల్లి అమాయకంగా ఉంటుంది కాబట్టి. తాజాగా సోషల్ మీడియాలో

Viral Video: పిల్లి పిల్లపై విరుచుకుపడిన మూడు పులులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Tigers Attack
uppula Raju
|

Updated on: Nov 24, 2021 | 4:15 PM

Share

Viral Video: సాధారణంగా ప్రజలు పులులను పెంచుకోరు కానీ పిల్లులను పెంచుకుంటారు. కారణం పిల్లి అమాయకంగా ఉంటుంది కాబట్టి. తాజాగా సోషల్ మీడియాలో ఒక పిల్లి పిల్ల, మూడు పులులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని దుబాయ్ పాలకుడి కుమార్తె షేక్ లతీఫా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూస్తే ఎవ్వరికైనా చెమటలు పట్టాల్సిందే. మూడు పులుల మధ్య చిక్కిన చిన్న పిల్లికి ఏమైందో వీడియో చూస్తే తెలుస్తుంది.

అనుకోకుండా పిల్లి పిల్ల పులి బోనులోకి వెళుతుంది. తరువాత మూడు పులులు దానిపై విరుచుకుపడుతాయి. దీంతో పిల్లి పిల్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అయినా కూడా ధైర్యం కోల్పోలేదు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పులులతో పోరాడుతూనే ఉంటుంది. అయితే ఈ వీడియోలో కనిపించే పులులను షేక్ లతీఫా పెంచుకున్నట్లు చెప్పారు. మొదటగా ఒక పులి.. పిల్లి పిల్లని నోటితో కొరుకుతూ బోనులోకి రావడం మనం వీడియోలో చూడవచ్చు. దానిని చూసిన మరో రెండు పులులు పిల్లి పిల్ల కోసం కొట్లాడుకోవటం మొదలుపెడుతాయి.

ఈ సమయంలో పిల్లి పిల్ల కూడా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ విఫలమవుతుంది. ఈ సమయంలో దానిని కాపాడేందుకు ఇద్దరు వ్యక్తులు రావడం మనం వీడియోలో గమనించవచ్చు. ఎట్టకేలకు పిల్లి పిల్ల ప్రాణాలు కాపాడారు. వీడియోను షేర్ చేస్తూ షేక్ లతీఫా క్యాప్షన్‌లో ఇలా రాశారు. ‘పిల్లి ప్రాణం రక్షించబడింది. ఇప్పుడు బాగానే ఉంది భయపడాల్సిన పని లేదు’ అని రాసింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు నిరంతరం కామెంట్లు చేస్తున్నారు. పిల్లి ధైర్యాన్ని మెచ్చుకోవడమే కాకుండా దానిని రక్షించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే షేక్ లతీఫా దగ్గర చాలా పెంపుడు జంతువులు ఉండటం గమనార్హం.

Kangana Ranaut: ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై కంగనా రియాక్షన్‌.. మరో వివాదాస్పద పోస్ట్‌ పెట్టిన బాలీవుడ్‌ క్వీన్‌..

PMGKAY: ఉచిత రేషన్ పథకాన్ని మరో నాలుగు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..

Agriculture laws: వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఎలా ఉపసంహరించుకుంటుంది.. ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి కావచ్చు? తెలుసుకోండి!