AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై కంగనా రియాక్షన్‌.. మరో వివాదాస్పద పోస్ట్‌ పెట్టిన బాలీవుడ్‌ క్వీన్‌..

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ..

Kangana Ranaut: ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై కంగనా రియాక్షన్‌.. మరో వివాదాస్పద పోస్ట్‌ పెట్టిన బాలీవుడ్‌ క్వీన్‌..
సౌత్ ఇండియా యంగ్ సెన్సేష‌న్ హీరోలు య‌ష్‌తో పాటు అల్లు అర్జున్ ఫోటోల‌తో కంగానా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఉ ఉ అంటావా అనే సాంగ్‌ను యాడ్ చేశారు కంగ‌నా.
Basha Shek
|

Updated on: Nov 24, 2021 | 4:41 PM

Share

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బాలీవుడ్‌ క్వీన్‌ ఒక్కసారిగా రెచ్చిపోయింది. కేంద్రంపై విమర్శలు చేయడంతో పాటు సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ, స్వాతంత్ర్యోద్యమంపై కూడా సోషల్‌ మీడియాలో పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. దీనిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో కంగనాపై కేసులు కూడా నమోదయ్యాయి. కాగా తమను ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చడంపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు ఆమెపై ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సిక్కుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తాజాగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై స్పందించిందీ ముద్దుగుమ్మ. ఒకవేళ ముంబై పోలీసులు తనను అరెస్ట్‌ చేయడానికి వస్తే ఇంట్లో తానెలా ఉంటానో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ బోల్డ్‌ ఫొటో పెట్టిందీ కాంట్రవర్సి క్వీన్‌. అందులో బ్లాక్‌ కలర్‌ బికినీ ధరించిన కంగనా చేతిలో వైన్‌ గ్లాస్‌ పట్టుకుని కనిపించడం గమనార్హం. ‘ మరో రోజు మరో ఎఫ్‌ఐఆర్‌. ఒకవేళ పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి వస్తే ఇంట్లో నా మూడ్ ఇలా ఉంటుంద‌’ని ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈపోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్నికి ఆజ్యం పోసేలా కంగనా వ్యవహారశైలి ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Also Read:

Tollywood : ఆ హీరోల సినిమాలకు బిగ్ షాక్.. టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న ప్రభుత్వ నిర్ణయం.

Actor Uttej : ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇప్పుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్..

Disha Patani: బర్త్ డే పార్టీలో టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేసిన దిశా సోదరి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..