PMGKAY: ఉచిత రేషన్ పథకాన్ని మరో నాలుగు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం

PM Garib Kalyan Anna Yojana: ఉచిత రేషన్ పథకాన్ని మరో 4 నెలల పాటు కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్చి 2022 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్..

PMGKAY: ఉచిత రేషన్ పథకాన్ని మరో నాలుగు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం
Pm Garib Kalyan Anna Yojana
Follow us
Surya Kala

|

Updated on: Nov 24, 2021 | 4:29 PM

PM Garib Kalyan Anna Yojana: ఉచిత రేషన్ పథకాన్ని మరో 4 నెలల పాటు కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్చి 2022 వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కొనసాగనుంది. పీఎంజీకేఏవై పథకం కింద 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహారధాన్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గా మరో నాలుగు నెలలు ఈ పథకం కొనసాగించడానికి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ. 53,344.52 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ విడతలో 163 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు విడుద చేయనుంది కేంద్ర సర్కార్. దీంతో నిరుపేద రేషన్ లబ్ధిదారులోని ప్రతి వ్యక్తి  ప్రతి నెలా 5 కేజీల ఆహారధాన్యాలు ఉచితంగా 2022 మార్చి వరకూ అందుకోనున్నారు.

దేశంలో COVID-19 మహమ్మారి వెలుగులోకి వచ్చిన సమయంలో .. మధ్య, పేద ప్రజలకు ఉపశమనం అందించడానికి ఈ పథకం మొదట ఏప్రిల్ 2020లో ప్రారంభించారు. మొదట మూడు నెలలపాటు ఈ పథకంగా ద్వారా లబ్ధిదారులకు ఉచిత ఆహారధాన్యాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు విధించారు. అనంతరం సంక్షోభం కొనసాగడంతో ఈ పథకాన్ని కేంద్ర  ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది.

ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద సాధారణ కోటా కంటే ఎక్కువ ఆహార ధాన్యాన్ని అందిస్తుంది. PMGKAYని మార్చి 2022 వరకు నాలుగు నెలల పాటు పొడిగించినట్లు మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. దీని వల్ల ఖజానాకు అదనంగా రూ. 53,344 కోట్లు ఖర్చు అవుతుందని.. ఈ పొడిగింపుతో  ఇప్పటివరకూ PMGKAY కింద మొత్తం వ్యయం ₹2.6 లక్షల కోట్లకు చేరుతుందని ఆయన అన్నారు.

Also Read:   రోజు రోజుకీ పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వాడకం.. పిల్లలో పెరుగుతున్న కంటిచూపు సమస్యలు..