AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayalalitha: పోయెస్ గార్డెన్ పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. జయలలిత మేన కోడలికే వేద నిలయం..

మద్రాసు హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది

Jayalalitha:  పోయెస్ గార్డెన్ పై మద్రాస్  హైకోర్టు కీలక తీర్పు.. జయలలిత మేన కోడలికే వేద నిలయం..
Basha Shek
|

Updated on: Nov 24, 2021 | 3:34 PM

Share

మద్రాసు హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలిలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులేదని, మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేన కోడలికి అప్పగించాలని ఈ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా జయలలిత 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్‌ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమని జయలలిత వారసులమని కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ఎలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తాజాగా వేద నిలయం ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది.

Also Read:

Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నివారణకు ముందస్తుగానే కృషి చేయాల్సి ఉంది.. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోండి..సుప్రీం కోర్టు

ISIS Magazine: ISIS ఆన్‌లైన్ మ్యాగజైన్‌ పోస్టర్ వివాదం.. భద్రతా పెంచిన కన్నడ ప్రభుత్వం

Union Cabinet: ఆ 3 వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం..