Pollution in Delhi: ఢిల్లీలో కాలుష్య నివారణకు ముందస్తుగానే కృషి చేయాల్సి ఉంది.. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోండి..సుప్రీం కోర్టు
వాయు కాలుష్య నివారణకు ముందస్తుగా కృషి చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

Pollution in Delhi: వాయు కాలుష్య నివారణకు ముందస్తుగా కృషి చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాతావరణం తీవ్రంగా ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటామని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి దీనిపై సుప్రీం కోర్టు ముందుగానే నివారణకోసం చర్యలు తీసుకోవాలనీ.. దేశ రాజధానిలో ఇటువంటి పరిస్థితి ఉంటె ప్రపంచానికి మనం ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నామో ఊహించుకోవాలనీ కోర్టు వ్యాఖ్యానించింది.
వాయుకాలుష్యంపై విచారణ ఆగదని, ప్రస్తుతానికి తుది ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విచారణ కొనసాగిస్తామని కోర్టు చెప్పింది. తదుపరి విచారణను నవంబర్ 29కి కోర్టు వాయిదా వేసింది. రాబోయే 3 రోజులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన కోర్టు.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. మరికొద్ది రోజుల్లో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందన్నారు. 3 రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తాం. వచ్చే 3 రోజుల పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఏదైనా మెరుగుదల ఉంటే, కొన్ని నిషేధాలను ఎత్తివేయవచ్చని కోర్టు తెలిపింది.
ఢిల్లీ చుట్టుపక్కల రైతులు పొట్టేలు తగులబెట్టే అంశంపై, తాము రాష్ట్రాలను మైక్రోమేనేజ్ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. జరిమానాపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది. రైతులతో మాట్లాడి పరిష్కారం చూడాల్సిఉందని కోర్టు చెప్పింది.
ఢిల్లీలో ఏక్యూఐ 300 కంటే ఎక్కువ, ఢిల్లీలో బుధవారం ఉదయం ఏక్యూఐ 357 నమోదైంది. ఈ ఉదయం ఢిల్లీలోని గాలి నాణ్యత పేలవమైన వర్గానికి చేరుకుంది. తక్కువ ఉష్ణోగ్రత మరియు నెమ్మదిగా గాలి కారణంగా కాలుష్య కారకాలు ఒకే చోట చేరాయి.
దీపావళి తరువాత పెరిగిన వాతావరణ కాలుష్యం..
దీపావళి పండుగ అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. రాజధానిలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించినా.. అన్ని ప్రాంతాల్లో ప్రజలు టపాసులను కాల్చారు. దీంతో ఢిల్లీని వాయు కాలుష్యం ముంచెత్తింది ఢిల్లీ, ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు.
దీపావళి సందర్భంగా చాలా మంది ప్రజలు వీధుల్లో క్రాకర్లు కాల్చారని.. దీంతో వాయుకాలుష్యం తీవ్రంగా పెరిగినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల చాలా మంది ప్రజల నుంచి గొంతు, దురద,కళ్ల నుంచి నీరు కారుతున్నట్లు ఫిర్యాదులు చేశారు. అయితే.. ఈ కాలుష్యం మూడు రోజుల పాటు ఇలానే ఉంటుందని.. ఆతర్వాత తగ్గే సూచనలు ఉన్నాయని అధికారులు అప్పుడు అధికారులు భావించారు. అయితే, రోజులు గడిచినా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తగ్గలేదు. దీనిపై సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వాలు కాలుష్యాన్ని తగ్గించే విషయంలో పలు చర్యలు తీసుకున్నాయి. అయినా.. ఇంకా అక్కడ వాతావరణ కాలుష్యం తగ్గలేదు.
ఇవి కూడా చదవండి: Andhra Pradesh: ఏపీ థియేటర్లలో ఇక నుంచి రోజుకు 4 షోలు మాత్రమే.. ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్లు
ISIS Magazine: ISIS ఆన్‌లైన్ మ్యాగజైన్ పోస్టర్ వివాదం.. భద్రతా పెంచిన కన్నడ ప్రభుత్వం