Navy MR Admit Card 2021: ఇండియన్‌ నేవీ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Navy MR Admit Card 2021: ఇండియన్ నేవీ మెట్రిక్ రిక్రూట్ సెల్లర్ పోస్ట్ కోసం అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసింది. సెయిలర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు

Navy MR Admit Card 2021: ఇండియన్‌ నేవీ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Indian Nevy
Follow us
uppula Raju

|

Updated on: Nov 24, 2021 | 6:59 PM

Navy MR Admit Card 2021: ఇండియన్ నేవీ మెట్రిక్ రిక్రూట్ సెల్లర్ పోస్ట్ కోసం అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసింది. సెయిలర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 300 పోస్టుల్లో నియామకాలు జరగాల్సి ఉంది. నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 300 పోస్టులకు దాదాపు 1500 మంది అభ్యర్థులను రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షకు పిలుస్తారు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా..? 1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.inకి వెళ్లాలి. 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన కెరీర్ & జాబ్స్ ఆప్షన్‌కు వెళ్లాలి. 3. ఇప్పుడు సెయిలర్ ఎంట్రీ మెట్రిక్ రిక్రూట్ MR ఏప్రిల్ 2022 బ్యాచ్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి. తదుపరి పేజీలో MR అడ్మిట్ కార్డ్ ఎంపికకు వెళ్లాలి 4. ఇక్కడ అభ్యర్థులు తమ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవుతారు. 5. తర్వాత అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 6. తదుపరి ఉపయోగం కోసం అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఎంపిక ప్రక్రియ ఈ పోస్టులకు రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది. పరీక్ష 30 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ 10వ తరగతి స్థాయికి సంబంధించినవి. పూర్తి సిలబస్‌ను జాయిన్ ఇండియన్ నేవీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ)కి హాజరుకావాల్సి ఉంటుంది.

జీతం వివరాలు ఈ ఉద్యోగానికి ఎంపికైన యువతకు ముందుగా శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో వారికి ప్రతి నెలా రూ.14,600 అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు. స్థాయి 3 ప్రకారం అన్ని ఇతర అలవెన్సులతో పాటు పూర్తి జీతం అందుబాటులో ఉంటుంది. ప్రారంభ జీతం నెలకు దాదాపు 50 వేల రూపాయలు వస్తుంది.

National Symbols: భారత జాతీయ చిహ్నాలు.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు..

Jiophone Next: జియో ఫోన్‌ విక్రయాలు ప్రారంభం.. ధర, ఆఫర్‌లు ఏ విధంగా ఉన్నాయంటే..?

అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?