UGC Scholarships 2021: యూజీసీ ఈ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లని అందిస్తోంది.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి..
UGC Scholarships 2021: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లను ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్ అకడమిక్ సెషన్ 21-22
UGC Scholarships 2021: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లను ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్ అకడమిక్ సెషన్ 21-22 విద్యార్థుల కోసం ప్రారంభించింది. నోటీసు ప్రకారం.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ NSP, Scholarships.gov.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2021 వరకు నిర్ణయించారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
యూజీసీ జారీ చేసిన నోటీసు ప్రకారం.. 2021-22 విద్యా సంవత్సరానికి కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులకు 4 స్కాలర్‌షిప్ పథకాలు ఉన్నాయి. ఇందులో ఇందిరా గాంధీ పీజీ స్కాలర్‌షిప్, పీజీ స్కాలర్‌షిప్, ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్‌షిప్, పీజీ స్కాలర్‌షిప్ ప్రొఫెషనల్ కోర్సుల పథకాలు. ఈ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన సమాచారాన్ని (NSP) అధికారిక వెబ్‌సైట్ Scholarships.gov.in సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇందిరాగాంధీ పీజీ స్కాలర్‌షిప్ (పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్ సింగిల్ గర్ల్ చైల్డ్) కింద ఆడపిల్లలకు ఏడాదికి రూ.36200 రెండేళ్లపాటు అందజేస్తారు.
యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ (యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ కోసం పీజీ స్కాలర్‌షిప్) అభ్యర్థులకు పీజీ స్కాలర్‌షిప్ కింద నెలకు రూ.3100 రెండేళ్లపాటు చెల్లిస్తారు. నార్త్ ఈస్టర్న్ రీజియన్‌కు ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్‌షిప్ మంజూరు చేస్తోంది. సాధారణ డిగ్రీ కోర్సులకు నెలకు రూ.5400, టెక్నికల్, మెడికల్, ప్రొఫెషనల్, పారామెడికల్ కోర్సులకు నెలకు రూ.7800 ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రొఫెషనల్ కోర్సులు ఎంఈ, ఎంటెక్ కోర్సులకు పీజీ స్కాలర్‌షిప్ నెలకు రూ.7800, ఇతర కోర్సులకు నెలకు రూ.4500 కేటాయించారు.