BPNL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా..! పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌లో బంపర్ ఖాళీలు
BPNL Recruitment 2021: భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ప్లానింగ్ వాల్యూమ్ ఆఫీసర్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BPNL Recruitment 2021: భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ప్లానింగ్ వాల్యూమ్ ఆఫీసర్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇదో చక్కటి అవకాశమని చెప్పవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 2325 పోస్ట్‌లు భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు BPNL అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ 30 నవంబర్ 2021. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
ఇలా అప్లై చేసుకోండి 1. BPNL అధికారిక వెబ్‌సైట్ www.bharatiyapashupalan.comని సందర్శించండి. 2. ఇక్కడ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయి”పై క్లిక్ చేయండి. 3. స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత “ఆన్‌లైన్ లింక్‌పై ”పై క్లిక్ చేయండి. 4. అభ్యర్థించిన సమాచారాన్ని ఇక్కడ నింపండి. 5. దరఖాస్తు రుసుమును చెల్లించి సమర్పించండి. 6. చివరిగా దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.
అర్హత ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ – దీని కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మార్కెటింగ్ రంగంలో అనుభవం కలిగి ఉండాలి. ప్లానింగ్ వాల్యూమ్ ఆఫీసర్ – 12వ తరగతి ఉత్తీర్ణత లేదా మార్కెటింగ్‌లో డిప్లొమా, మార్కెటింగ్‌లో అనుభవం. ప్లానింగ్ అసిస్టెంట్ – 10వ తరగతి ఉత్తీర్ణత లేదా మార్కెటింగ్‌లో డిప్లొమా, మార్కెటింగ్‌లో అనుభవం.
దరఖాస్తు రుసుము మూడు పోస్టులకు దరఖాస్తు రుసుము వేర్వేరుగా ఉంటుంది. ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు రూ.590, ప్లానింగ్ వాల్యూమ్ ఆఫీసర్‌కు రూ.708, ప్లానింగ్ అసిస్టెంట్‌కు రూ.826. దయచేసి ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.
ఎంపిక ప్రక్రియ ఈ నోటిఫికేషన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.