AIC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు..
AIC Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు చాలా మంచి అవకాశం వచ్చింది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజ్‌మెంట్

AIC Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు చాలా మంచి అవకాశం వచ్చింది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ, హిందీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించాలి. ఈ పోస్ట్‌లకు అప్లై చేయడానికి చివరితేదీ డిసెంబర్ 13, 2021గా నిర్ణయించారు. ఫీజు చెల్లించడానికి కూడా ఇదే చివరితేదీ. ఈ పోస్టులకు జనవరి నెలలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒక్కసారి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవడం ముఖ్యం.
ఖాళీల వివరాలు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 31 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 30, హిందీ ఆఫీసర్‌కు ఒక పోస్టును కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం.. మేనేజ్‌మెంట్ ట్రైనీ 30 పోస్టులలో 14 సీట్లు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. ఓబీసీకి 8 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 2 సీట్లు, ఎస్సీ అభ్యర్థులకు 5 సీట్లు, ఎస్టీకి 2 సీట్లు కేటాయించారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి 1. దరఖాస్తు చేయడానికి, ముందుగా aicofindia.com అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో, మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్ట్ & డైరెక్ట్ రిక్రూట్ హిందీ ఆఫీసర్ (స్కేల్ I) కోసం దరఖాస్తును ఆహ్వానించడంపై క్లిక్ చేయండి. 3. ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌కి వెళ్లండి. 4. ఇందులో కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అనే లింక్‌పై క్లిక్ చేయండి. 5. ఇప్పుడు అభ్యర్థించిన వివరాలను నింపడం ద్వారా మీ పేరు నమోదు చేసుకోండి. 6. రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
అర్హత మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Sc అగ్రికల్చర్, B.Tech లేదా M.Tech అగ్రికల్చర్ చేసి ఉండాలి. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ ఆఫీసర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హిందీ సబ్జెక్టుతో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇందులో 60% మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.