పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న యువతి.. అనస్థీషియా లేకుండా కిడ్నీ స్టోన్‌ సర్జరీ చేసిన వైద్యులు..!

పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఓ యువతి తీవ్ర కడుపునొప్పితో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఇప్పటికే గుండె సమస్య ఉన్నందున ఆమెకు సర్జరీ చేయాలంటే అవసరమైన ఏ రకమైన అనస్థీషియా ఇవ్వలేమని కార్డియాలజిస్ట్ హెచ్చరించాడు.

పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న యువతి.. అనస్థీషియా లేకుండా కిడ్నీ స్టోన్‌ సర్జరీ చేసిన వైద్యులు..!
Kidney Stone Surgery
Follow us

|

Updated on: Nov 21, 2022 | 4:48 PM

పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఓ యువతి కడుపునొప్పితో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపునొప్పికి కారణం కిడ్నీ స్టోన్ తేల్చారు. అనంతరం ఆ యువతికి అనస్థీషియా ఇవ్వకుండానే కేవలం ఐవీ సెడేషన్ ద్వారాన ఆపరేషన్‌ చేసి కిడ్నీలో రాళ్లను తొలగించారు. ఈ అరుదైన ఘటన అస్సాం రాష్ట్రంలో వెలుగు చూసింది. పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ యువతికి అనస్థీషియా ఇవ్వకుండా కేవలం ఐవీ సెడేషన్ ద్వారానే కష్టతరమైన కిడ్నీలో రాళ్లను తొలగించే శస్త్ర చికిత్సను జయనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు నిర్వహించి ఘనత సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఓ యువతి కడుపునొప్పితో జయనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించగా.. కడుపునొప్పికి కారణం కిడ్నీ స్టోన్ అని తేలింది. కానీ ఆమె హార్ట్ పేషెంట్ కాబట్టి ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇవ్వలేరు.. కాబట్టి హాస్పిటల్‌లోని ప్రిన్సిపల్ యూరాలజిస్ట్, డైరెక్టర్ ఆఫ్ క్లినికల్ ఎక్సలెన్స్ డాక్టర్ రాజీవ్ బశెట్టి నేతృత్వంలో ప్రత్యేక ఈఎస్‌డబ్ల్యుఎల్ విధానాన్ని ఉపయోగించి కిడ్నిలో రాయిని తొలగించాలని నిర్ణయించారు. కానీ ఇక్కడ సవాలు ఏమిటంటే ఆమె మూత్రాశయంలోని రాయి చాలా పెద్దది. దాంతో మూత్రనాళంలో స్టెంట్ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గుండె సమస్య ఉన్నందున ఈ మొత్తం ప్రక్రియకు అవసరమైన ఏ రకమైన అనస్థీషియా ఇవ్వలేమని కార్డియాలజిస్ట్ హెచ్చరించాడు.

Kidney Stone

ఇవి కూడా చదవండి

అలాగే, ఇది హై రిస్క్ కేస్ అయినందున ఇతర ఆసుపత్రులు ఈ రోగి కిడ్నీ స్టోన్‌ను తొలగించడానికి నిరాకరించాయి. దీన్ని సవాలుగా తీసుకున్న యునైటెడ్ హాస్పిటల్‌లోని వైద్యులు.. పెద్ద రాయి వల్ల తీవ్రమైన కడుపునొప్పి, ఇన్‌ఫెక్షన్, మూత్రాశయం దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ఆసుపత్రి చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డా. సాగర్ శ్రీనివాస్ ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.. ఈ విపరీతమైన, ప్రమాదకరమైన కేసును నిర్వహించడానికి అంగీకరించిన వైద్యులు చికిత్సను ప్రారంభించడానికి IV మత్తు, నిద్ర మాత్రలు, నిరంతర గుండె రక్షణను పర్యవేక్షిస్తూ సర్జరీ పూర్తి చేశారు. డాక్టర్ రాజీవ్ బా శెట్టి ఈఎస్‌డబ్ల్యూఎల్ విధానం ద్వారా రోగి మూత్రాశయంలోని రాయిని విజయవంతంగా తొలగించారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి