Madras Eye Cases: తమిళనాడును వణికిస్తున్న “మద్రాస్ ఐ”.. ఈ వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి..

మదురైలో మద్రాస్‌ ఐ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్‌ నుంచి అధిక వర్షాలతో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కళ్లమంట, దురద, కళ్లు ఎర్రగా మారడం, నీరు కారడం,

Madras Eye Cases: తమిళనాడును వణికిస్తున్న మద్రాస్ ఐ.. ఈ వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి..
Madras Eye Cases
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 21, 2022 | 5:42 PM

తమిళనాడు ప్రజలను మద్రాస్‌ ఐ వణికిస్తోంది. ఆస్పత్రులన్నీ కళ్లకలక బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 2వందల నుంచి 250మంది వరకు చికిత్స పొందుతున్నారు. మదురైలో మద్రాస్‌ ఐ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్‌ నుంచి అధిక వర్షాలతో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కళ్లమంట, దురద, కళ్లు ఎర్రగా మారడం, నీరు కారడం, కనురెప్పులు అంటుకుపోవడం, కళ్లు తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 4,500 మంది కంటి సమస్యలతో చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు లక్షన్నర మందికి ట్రీట్‌మెంట్‌ అందించినట్టు తెలిపారు. కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు సరైన వ్యైద్యం తీసుకోవాలని..అలాగే ఇది అంటువ్యాధి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ వైరస్ సోకిన వారు నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జ్వరం, జలుబు, దగ్గుతో పాటు అంటువ్యాధులు పెరిగిపోతున్నాయి. అలాగే దోమల బెడదతో డెంగ్యూ విజృంభిస్తోంది. దీని నివారణకు తమిళనాడు ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తోంది. ఐతే కళ్ళకలక ఈ సీజన్‌లో వచ్చే సాధారణ వైరసే అయినా రాష్ట్రమంతటా వ్యాపించడం ప్రభుత్వాన్ని కూడా కలవరపెడుతోంది. దీంతో మద్రాస్‌ ఐ నియంత్రణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం.

కంటి వ్యాధి

మీకు మద్రాసు కంటి వ్యాధి ఉంటే, మీ కళ్ళు ఎర్రగా, చికాకు మరియు దురదగా మారుతాయి. నీళ్ళు నిండిన కళ్ళు. కాబట్టి ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులు వారు ఉపయోగించిన వస్తువులను ఉపయోగించకూడదు. కళ్లలో ఇలాంటి సమస్య ఉంటే సొంతంగా మెడికల్ షాపుకు వెళ్లి కంటి చుక్కలు వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

అంటు వ్యాధి

కంటి వ్యాధి అంటు వ్యాధి కాబట్టి అతన్ని వేరుచేయడం అవసరం. అతను ఉపయోగించిన ఉత్పత్తులను ఎవరూ ఉపయోగించకూడదు. మీ చేతులను తరచుగా సబ్బుతో కడగాలి. ఎవరినీ కళ్లతో చూడకండి. డార్క్ గ్లాసెస్ ధరించాలని వైద్యులు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం