వందేళ్లయినా కిడ్నీలు చెడిపోకుండా కాపాడే సూపర్ ఫుడ్..! కానీ, వాటి జోలికి అస్సలు పోవద్దు..
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో పుష్కలంగా ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. కాలీఫ్లవర్, క్యాబేజీ, రెడ్ బెల్ పెప్పర్స్, వెల్లుల్లి వంటి తాజా కూరగాయలతో సహా వివిధ రకాల కాలానుగుణ రంగురంగుల పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.. మీ కిడ్నీలు కలకాలం చెడిపోకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తినకూడదు.. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..? అనే వివరాలను తెలుసుకుందాం..

ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో చాలామంది పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూత్రపిండాల (కిడ్నీలు) ఆరోగ్యం పై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. మనశరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. ఇవి రక్తాన్ని వడపోసి శుద్ధి చేస్తాయి. వ్యర్థ పదార్థాలు, అదనపు నీటిని మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అలాగే, శరీరంలోని pH స్థాయిలను, ఉప్పు స్థాయిలను నియంత్రిస్తాయి.. రక్తపోటు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పర్యవేక్షిస్తాయి.
అయితే.. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మనం మన ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ముందుగా, ఎక్కువ ఉప్పు, ఎక్కువ ప్రోటీన్ తినడం మానుకోవాలి.. ఎందుకంటే ఇవి మూత్రపిండాలపై చాలా ఒత్తిడిని కలిగిస్తాయని.. అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎల్లప్పుడూ సమతుల్య ఆహారం తీసుకోండి. ఆపిల్, బెర్రీస్, పైనాపిల్, నారింజ – ఇతర కాలానుగుణ పండ్లు వంటి తాజా పండ్లను చేర్చుకోండి. ఈ పండ్లలో పొటాషియం తక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫైబర్ – విటమిన్లు సమృద్ధిగా ఉండే ఈ పండ్లు వాపును తగ్గిస్తాయి. ఇంకా మూత్రపిండాల కణాలను రక్షిస్తాయి.
కిడ్నీ రోగులు తమ ఆహారంలో పుష్కలంగా ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. కాలీఫ్లవర్, క్యాబేజీ, రెడ్ బెల్ పెప్పర్స్, వెల్లుల్లి వంటి తాజా కూరగాయలతో సహా వివిధ రకాల రంగురంగుల కూరగాయలను తినండి.
మీరు మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలను కూడా చేర్చుకోవాలి. చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్ – ప్యాక్ చేసిన జ్యూస్‌లు వంటి ఎక్కువగా ప్యాక్ చేయబడిన ఆహారాలు.. ఫ్యాక్టరీలో తయారు చేసిన ఆహారాలను నివారించండి.. ఎందుకంటే అవి మూత్రపిండాలు – శరీరం రెండింటికీ హానికరం..
మీ మూత్రపిండాలు ఇప్పటికే బలహీనంగా ఉంటే, ప్రత్యేక శ్రద్ధ, ఆహార నియంత్రణ అవసరం. కాబట్టి, మీరు వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించి మంచి ఆహార ప్రణాళికను ప్లాన్ చేసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




