AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లగా ఉందని రోజంతా వేడి నీళ్లే తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

శీతాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల వేడి నీళ్లు తాగవచ్చు? రోజంతా వేడి నీళ్లు తాగడం సరైందేనా?ఒక రోజులో ఎంత వేడి నీరు తాగాలి? బరువు తగ్గాలన్నా లేదా కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందాలన్నా చాలా మంది ఎక్కువగా వేడి నీటిని ఆశ్రయిస్తారు. వేడి నీరు తాగడం ప్రయోజనకరమని నమ్ముతారు. అయితే ఒక రోజులో ఎంత వేడి నీళ్లు తాగాలి..రోజంతా వేడి నీరు త్రాగడం సరైనదేనా అనే విషయాలు తప్పక తెలుసుకోవాలి..

చల్లగా ఉందని రోజంతా వేడి నీళ్లే తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
Winter Warm Water
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2025 | 5:26 PM

Share

శీతాకాలంలో చలి వాతావరణం వల్ల మనం తక్కువ నీరు తాగుతాము. ఎందుకంటే చలి దాహాన్ని తగ్గిస్తుంది. కొన్నిసార్లు మనం పనిలో బిజీగా ఉండటం లేదా సోమరితనం వల్ల కూడా నీళ్లు తాగడం మర్చిపోతుంటాము.. కానీ మన శరీరాలకు వేసవిలో ఎంత హైడ్రేషన్ అవసరమో శీతాకాలంలో కూడా అంతే హైడ్రేషన్ అవసరమని తప్పక గుర్తించుకోవాలి. అందువల్ల చాలా మంది చలి కాలంలో వేడి నీళ్లు తాగాలని చెబుతుంటారు. అయితే, ప్రతిసారీ వేడి నీళ్లు తాగడం మంచిదేనా..? ఒక రోజులో ఎంత వేడి నీళ్లు తాగాలి..? ఇలాంటి సందేహాలకు నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం…

శరీరానికి గోరువెచ్చని నీరు ఎందుకు అవసరం?:

శీతాకాలంలో శరీర జీవక్రియ కొద్దిగా నెమ్మదిస్తుంది. చల్లటి నీరు తాగడం వల్ల శరీరం చల్లగా అనిపిస్తుంది. దానిని వెచ్చగా ఉంచడానికి ఎక్కువ శక్తి అవసరం. వెచ్చని లేదా గోరువెచ్చని నీరు శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జలుబును నివారించడంలో కూడా సహాయపడుతుంది. చలికాలంలో వేడినీళ్లు తాగటం వల్ల శరీరం నిర్విషీకరణ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ బలపడుతుంది. గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

శీతాకాలంలో ఎంత వేడి నీళ్లు తాగాలి?:

ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగాలని చెబుతున్నారు. శీతాకాలంలో మీరు ఈ నీటిని గోరువెచ్చగా లేదా కొద్దిగా వేడిగా తాగవచ్చు. అంటే రోజంతా 8 నుండి 10 గ్లాసుల వెచ్చని నీరు తాగొచ్చునని చెబుతున్నారు. కానీ ఇంత నీరు తాగడం అంటే మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో తాగాలని కాదు. రోజంతా తక్కువ మొత్తంలో తాగుతూ ఉండాలి. కొన్ని సమయాల్లో కడుపు నిండా తాగాలి. ఉదాహరణకు.. ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. అదే, అల్పాహారం తర్వాత భోజనం మధ్య ఒకటి లేదా రెండు గ్లాసులు తాగొచ్చు. ఇక సాయంత్రం ఒక గ్లాసు. నిద్రపోయే 30 నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

రోజంతా వేడి నీళ్లు మాత్రమే తాగడం మంచిదేనా?:

రోజంతా గోరువెచ్చని నీరు మాత్రమే తాగడం అందరికీ అవసరం లేదు. ఇది సరైనది కూడా కాదు. నీరు చాలా వేడిగా ఉంటే, అది అంతర్గత శరీర కణజాలాలను దెబ్బతీస్తుంది. గొంతు లేదా కడుపు లైనింగ్‌ను కాల్చేస్తుంది. వేడి నీటిని మరిగే కంటే గోరువెచ్చగా తాగడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us