Kakarakaya Tea: డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులకు కాకరకాయ టీ దివ్యౌషధం.. ఈ టీని ఎలా తయారు చేయాలి.? కలిగే లాభాలేంటీ..

Kakarakaya Tea: కాకరకాయ రుచికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చేదుగా ఉన్నా నెలలో ఒక్కసారైనా ఈ కూరను తినాలని పెద్దలు చెబుతుంటారు...

Kakarakaya Tea: డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులకు కాకరకాయ టీ దివ్యౌషధం.. ఈ టీని ఎలా తయారు చేయాలి.? కలిగే లాభాలేంటీ..
Kakara Kaya Tea Benefits
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 20, 2021 | 7:44 AM

Kakarakaya Tea: కాకరకాయ రుచికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చేదుగా ఉన్నా నెలలో ఒక్కసారైనా ఈ కూరను తినాలని పెద్దలు చెబుతుంటారు. ఇక ఇందులో ఉండే దివ్యౌషధాలు ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కాకరకాయను కూర రూపంలోగానీ, పచ్చిగా కానీ తినలేని వారు టీ రూపంలో చేసుకునే తాగితే కూడా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఇంతకీ కాకరకాయతో టీని ఎలా తయారు చేస్తారు.? దీనితో కలిగే లాభాలు ఏంటి.. అన్న వివరాలు ఓ సారి చూద్దాం..

* కాకరకాయ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుంది. ఇది క్యాన్సర్‌ రాకుండా కూడా చేస్తుంది. * శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కాకర టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టీని తాగడం వల్ల అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. * కాకరకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటితో తయారు చేసిన టీని తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతంది. ఈ కారణంగా రోగాల భారిన పడే అవకాశాలు తగ్గుతాయి. * డయాబెటిస్‌తో బాధపడేవారికి కాకరకాయ మంచి ఔషధంలా పనిచేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాకరకాయ టీ రూపంలో తీసుకుంటే బ్లడ్‌లో షుగర్‌ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. * ఇక కాకరలో ఉండే గుణాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కాకరకాయ టీ ఉపయోగపడుతుంది.

ఇంతకీ ఈ టీని ఎలా తయారు చేసుకోవాలంటే..

ముందుగా కాకరకాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఎండబెట్టాలి. అనంతరం ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కొన్ని ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు చేసిన తర్వాత టీని వడకట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఒక కప్పు చొప్పున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read: Walking: ఆరోగ్యం కోసం రోజుకు 10,000 అడుగుల నడక రూల్ కరెక్టేనా? ఫిట్‌నెస్ నిపుణులు ఏమంటున్నారు?

Weight Lose : బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..! అయితే ముందుగా మీ కేలరీల సంఖ్యను లెక్కించండి..

Munagaku: ఆషాడ మాసంలో మునగాకు కూర ఎందుకు తింటారు..? అసలు దీని ప్రయోజనాలు ఏంటి..?