Migraine Food: మైగ్రేన్ తల నొప్పితో నరకం అనుభవిస్తున్నారా..? అయితే వీటిని ఆహారంలో భాగం చేసుకోండి ఫలితం ఉంటుంది.
Migraine Food: మనలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్న వారు నొప్పి భరించలేక నరకం అనుభవిస్తుంటారు. మరీ ముఖ్యంగా వాతావరణం చల్ల బడే ఈ కాలంలో...
Migraine Food: మనలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్న వారు నొప్పి భరించలేక నరకం అనుభవిస్తుంటారు. మరీ ముఖ్యంగా వాతావరణం చల్ల బడే ఈ కాలంలో మైగ్రేన్ నొప్పి బయటకు వస్తుంది. ఇక ఎన్ని రకాల మందులు వాడినా అంత సులభంగా ఈ సమస్య నుంచి బయట పడలేం. అయితే మనం తీసుకునే కొన్ని ఆహార పదర్థాల ద్వారా మైగ్రేన్ నొప్పికి చెక్ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* మైగ్రేన్ సమస్యతో బాధపడే వారు అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అన్ని రకాల నొప్పులను దూరం చేస్తుంది. ఇక అల్లం రసాన్ని నేరుగా తీసుకున్నా, అల్లంతో డికాషన్ చేసుకొని తాగినా మంచి ఫలితం లభిస్తుంది. * పెరుగులో ఉండే బి విటమిన్ మైగ్రేన్‌ను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మైగ్రేన్ సమస్యతో బాధపడే వారు రోజు పెరుగును తీసుకుంటే మంచి ఫలితం పొందొచ్చు. * మైగ్రేన్‌తో బాధపడుతోన్న వారు చేపలు, ఆకుపచ్చ కూరగాయలను క్రమం తప్పంకుడా తీసుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. * అంజీర్ పండులో ఉండే పొటాషియం వాపులను తగ్గిస్తుంది. అంజీర్ పండును డ్రై ఫ్రూట్‌గా లేదా నేరుగా పండు రూపంలో కూడా తీసుకోవచ్చు. వీటిలో ఉండే కొన్ని విటమిన్‌లకు నొప్పులను తగ్గించే శక్తి ఉంది. * మైగ్రేన్‌కు పుచ్చకాయ కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో మైగ్రేన్‌కు చెక్ పెట్టొచ్చు. * కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ కారణంగా కూడా మైగ్రేన్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి రోజూ సరిపడ నీరు తీసుకోవడం ద్వారా మైగ్రేన్‌కు ఫుల్ స్టాఫ్ పెట్టొచ్చు.
Also Read: Ghevar Mithai: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. డ్రై ఫ్రూట్స్ గెవర్ తయారీ ఇలా..
Anemia: రక్తహీనతను పరీక్షించడానికి కొత్త విధానం.. కంటి కింది రెప్ప ఫోటోతో..
Skin Care : చర్మం మెరుస్తూ ఉండాలంటే ఈ 3 తప్పులు అస్సలు చేయొద్దు..! ఏంటో తెలుసుకోండి..