Orange Benefits: నారింజ ప్రయోజనాలు తెలిస్తే షాకే.. సులువుగా బరువు తగ్గొచ్చు.. మరెన్నో లాభాలు

Health Benefits of Orange: మన దైనందన జీవితంలో చాలా రకాల పండ్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే సమయానుకూలంగా

Orange Benefits: నారింజ ప్రయోజనాలు తెలిస్తే షాకే.. సులువుగా బరువు తగ్గొచ్చు.. మరెన్నో లాభాలు
Health Benefits of Orange
Follow us

|

Updated on: Jul 20, 2021 | 1:10 PM

Health Benefits of Orange: మన దైనందన జీవితంలో చాలా రకాల పండ్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే సమయానుకూలంగా పండ్లను తినాలంటారు వైద్య నిపుణులు. అలాంటి పండ్లల్లో నారింజ (ఆరెంజ్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నారింజ పండులో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌తోపాటు విటమిన్ సి కావాల్సినంత ఉంటుంది. నారింజ (సంత్ర) మీమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

నారింజ యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలోని లక్షణాలు అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు సాయపడుతాయి. శీతాకాలంతోపాటు అన్ని సీజన్లల్లో దొరికే ఈ పండును సాధారణంగా తిన్నా.. లేక జ్యూస్ చేసుకొని తాగిన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీలైనప్పుడల్లా అలాంటి నారింజ పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి.. నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నారింజలో ఉండే ఫైబర్.. ఆకలిని అరికట్టి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకోలేరు. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

చర్మ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది నారింజలో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు అత్యధికంగా ఉంటాయి. అవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడతాయి. వీటిని తినడం ద్వారా చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. దీంతోపాటు చర్మానికి సంబంధించిన కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది.

రక్తపోటును నియంత్రణ నారింజలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిద్వారా గుండె కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.. ఆరెంజ్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఆరెంజ్‌లో ఫైబర్ (పెక్టిన్) పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కాలేయానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా నివారించి.. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి నారింజలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఈ పండ్లలోని ఫోలేట్, రాగి వంటి అనేక పోషకాలు మన ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడంలో సాయపడతాయి.

కిడ్నీల్లో రాళ్లు.. శరీరంలో సిట్రేట్ లోపం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అయితే.. నారింజ సిట్రేట్ స్థాయిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. నారింజలో కాల్షియం కూడా మూత్ర సమస్యలను నివారించడంలో సాయపడతాయి.

orange, orange benefits, benefits of orange, orange fruit benefits, orange fruit, orange health benefits, benefits of oranges, orange benefits, oranges benefits, health, health news, health benefits of oranges, health benefits of orange, orange fruit in telugu,