AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leggings-StyleTips: లెగ్గింగ్స్ కొంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటిస్తే.. అందానికి అందం..సౌకర్యానికి సౌకర్యం

Leggings-StyleTips: నేటి తరంలో ఫ్యాషన్స్ ను అనుకరిస్తూ.. అలంకరించుకోవడమే కాదు.. దుస్తులను కూడా ధరిస్తుంది. ప్రస్తుత కాలంలో జీన్స్ ను ఎంత ఇష్టపడే అమ్మాయి..

Leggings-StyleTips: లెగ్గింగ్స్ కొంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటిస్తే.. అందానికి అందం..సౌకర్యానికి సౌకర్యం
Leggings
Surya Kala
|

Updated on: Jul 20, 2021 | 3:07 PM

Share

Leggings-StyleTips: నేటి తరంలో ఫ్యాషన్స్ ను అనుకరిస్తూ.. అలంకరించుకోవడమే కాదు.. దుస్తులను కూడా ధరిస్తుంది. ప్రస్తుత కాలంలో జీన్స్ ను ఎంత ఇష్టపడే అమ్మాయి అయినా.. లెగ్గింగ్స్ కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. టాప్స్ ఏమైనా సరే లెగ్గింగ్స్ వేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే ఈ లెగ్గింగ్స్అనేవి ఇప్పుడు ట్రెండ్ సృష్టితున్నా.. ఒకప్పుడు పాత కాలం సినిమాలు చూసిన వారికీ తెలుస్తుంది. కత్తి కాంతారావు, ఎన్టీఆర్ వంటి హీరోలు జానపద సినిమాల్లో ఎక్కువగా లెగ్గింగ్స్ ను ధరించేవారు. ఆ ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అయితే లెగ్గింగ్స్కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే లెగ్గింగ్స్ శరీరానికి హత్తుకుని ఉంటాయి. కనుక సరైన క్వాలిటీవీ సెలెక్ట్ చేసుకోకుండా ఏదోకటి అని కొనేస్తే.. అప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ముందుగా లెగ్గింగ్స్ యొక్క పొడవు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అవి వేసుకున్నప్పుడు షార్ట్ గా కనిపిస్తాయి. స్ట్రెచ్చింగ్ కోసం అయితే ఫర్మ్ లెగ్గింగ్స్ తీసుకోవాలి. సన్నగా ఉండే లెగ్ ఫీట్ లెగ్గింగ్స్ తీసుకునేటప్పుడు.. దాని పొడవు, ఫిట్టింగులను మీ శరీరాకృతికి సరిపోతున్నాయి లేదో చూసుకుని తీసుకోవాలి

ముఖ్యంగా లెగ్గింగ్స్ వేసుకునే సమయంలో లో దుస్తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లెగ్గిన్స్ ఎక్కువగా స్మూత్ క్లాత్ తో తయారు చేస్తారు కనుక… లో దుస్తులు మందం ఉన్నవి వేసుకోకూడదు.. ఎందుకంటే.. అవి లెగ్గింగ్స్ నుంచి బయటకు కనిపిస్తాయి. ఇక లెగ్గింగ్స్ కు మరింత అందం లుక్ తీసుకుని రావడానికి స్టైలిష్ గా కనిపించేందుకు యాంకిల్ బూట్స్ లేదా స్నీకర్స్ లాంటివి వేసుకోవాలి.

లెగ్గింగ్స్ కొనేసమయంలో ఎక్కువగా నియాన్ కలర్ లేదా పాప్ కలర్, లెదర్ లెగ్గింగ్స్ కు ప్రాధాన్యత ఇవ్వండి. అవి ఏ రంగు, శరీరం తీరు ఉన్నవారికైనా మంచి లుక్ ని ఇస్తాయి. అయితే చాలా మంది లెగ్గింగ్స్ కు పైన టాప్ కింద షార్ట్ టాప్ ని వేసుకుంటారు. అది లెగ్గింగ్స్లుక్ ని .. మీ శరీరం తీరుని డిఫరెంట్ లుక్ లో చూపిస్తుంది. కనుక లెగ్గింగ్స్‌ పై ట్యూనిక్ లేదా పొడవాటి చొక్కా వేసుకుంటే పర్ఫెక్ట్ లుక్ చూపిస్తుంది. ప్రస్తుతం యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్స్ ట్రెండ్ లో ఉన్నాయి. వీటిని ధరించడానికి యువత నుంచి నడివయసు స్త్రీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ యాంకిల్ లెంగ్త్ లెగ్గింగ్స్ ధరించినప్పుడు పొడవాటి కుర్తా మంచి నిండుదనాన్ని ఇస్తుంది. ఈ జాగ్రత్తలను తీసుకుని లెగ్గింగ్స్ కనుక ధరిస్తే.. అందానికి అందం.. సేఫ్ కు సేఫ్ గా ఉంటారు.

Also Read: అంజి విషయంలో ఎంక్వైరీ మొదలు పెట్టిన రోషిణి.. కార్తీక్ ని పెళ్లి చేసుకునేందుకు ఎంతకైనా వెళ్తానంటున్న మోనిత

Follow Us