Karthika Deepam: అంజి విషయంలో ఎంక్వైరీ మొదలు పెట్టిన రోషిణి.. కార్తీక్ ని పెళ్లి చేసుకునేందుకు ఎంతకైనా వెళ్తానంటున్న మోనిత

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ జూలై 20 న 1096 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లో హైలెట్స్ ఏమిటో చూద్దాం.. ఏఎస్పీ రోషిణి తో దీప మోనిత గతం గురించి చెబుతూ.. అంజి చేసిన హత్య..

Karthika Deepam: అంజి విషయంలో ఎంక్వైరీ మొదలు పెట్టిన రోషిణి.. కార్తీక్ ని పెళ్లి చేసుకునేందుకు ఎంతకైనా వెళ్తానంటున్న మోనిత
Karthika Deepam
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 20, 2021 | 8:59 AM

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ జూలై 20 న 1096 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు సీరియల్ లో హైలెట్స్ ఏమిటో చూద్దాం.. ఏఎస్పీ రోషిణి తో దీప మోనిత గతం గురించి చెబుతూ.. అంజి చేసిన హత్య గురించి చెబుతుంది. దీంతో రోషిణి అంజి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే… తెలియదు మేడం.. మా ఇంట్లో డ్రైవర్ గా మానేసి వెళ్ళిపోయాడు అంటుంది. దీప.. దీంతో రోషిణి ,, బాగుంది కడుపు నుంచి హత్య వరకూ వెళ్ళింది కేసు అంటే.. ఒక్క మాట మేడం.. మోనిత కేసు పెట్టింది కనుక మీకు ఈ విషయాలను చెప్పను.. లేదంటే.. నేనే మోనిత గుట్టంతా విప్పేదానిని అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఆనందరావు కార్తీక్ మోనితల పెళ్లి విషయం తనకు ఎవరూ ఎందుకు చెప్పలేదు .. సౌందర్యకు తెలుసా లేదా తెలిస్తే.. నా ఆరోగ్యం గురించి అలోచించి చెప్పడం లేదా అంటూ ఆలోచిస్తాడు.. కార్తీక్ ని ఈ విషయంలో తిడితే గానీ తనకు మనసు శాంతి ఉందని ఆలోచిస్తుంన్నాడు. భాగ్యం దీప ఇంటికి వచ్చింది. పిల్లలు చదువుకుంటుంటే.. బాగా చదువుకోండి అంటుంది. అమ్మ ఏది అంటే.. రోషిణి మేడం దగ్గరకు వెళ్ళింది. వంట చేయడానికి నాన్నకు ఇష్టం లేకపోయినా పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా అంటారు శౌర్య, హిమలు. దీంతో భాగ్యం పాపం పిల్ల మొగుడిని కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో అని భాగ్యం ఫీలవుతుంటే దీప వస్తుంది. ఏమైంది పిన్ని అంటే.. వెళ్లిన పని అయిందిఆ.. నీకు తెలిసిన కూరలన్నీ వండి పెట్టావా అంటూ.. నర్మగర్భంగా అడుగుతుంది. పిల్లలకు తెలియకుండా అన్ని చెప్పాను .. కావలసినవన్నీ అడిగారు అంటుంది. వంట చేసి తీసుకొచ్చా.. వంటపని పెట్టుకోకు అంటూ.. సేమియా తీసుకొచ్చా అంటుంది.. నాకు సేమ్యా చాలా ఇష్టం అంటే.. మీకు ఎప్పుడు ఏమి కావాలన్నా నాకు ఫోన్ చేయండి.. నేను రాకపోయినా మీ తాతయ్యతో పంపిస్తా అంటుంది.. దీప తనను ఎలా చూసింది గుర్తు చేసుకుని.. పిన్ని లో ఎంత మార్పు.. సవతి తల్లి కాస్తా సొంత తల్లిలా మరింది అనుకుంటుంది.

నువ్వు తిను అంటే తర్వాత తింటా అంటుంది దీప.. అయితే సరే రా హాస్పటల్ కి వెళ్దాం అంటుంది భాగ్యం ఎందుకు పిన్ని అంటే.. మీ ఆయన పెట్టిన జనతా క్లినిక్ కు అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం.. అంటే పదా అంటుంది.

మోనిత ,, దీప ఇచ్చిన వార్నింగ్ ని గుర్తుకు తెచ్చుకుంటూ.. నేను ఎక్కు పెట్టిన బాణాలు నాకే ఎదురవుతున్నాయి.. కార్తీక్ తో పెళ్లి నాకు చాలా ఈజీ అనుకున్నా దీప ఇంతగా రియాక్ట్ అవుతుంది అని అనుకోలేదు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుంది. దుర్గ గాడి తెలియలేదు,, దీప అంజి ప్రస్తావన తీసుకొస్తుంది. ఈ విషయం రోషిణి కి చెబితే.. నాపై అనుమానం వస్తే.. నాకు శిక్ష తప్పదు.. కార్తీక్ తో నాకు పెళ్లి జరగాలని కోరుకున్నా గానీ.. జైలు కు వెళ్లాలని కోరుకోలేదు. సో ఏదోకటి చేసి జారబోయే ప్రమాదాన్ని .. ఆ దీపని ఆపాలి.. కానీ ఎలా అని ఆలోచిస్తుంది.. ఇంతలో ప్రియమణి వస్తుంది. ఏమిటమ్మా ఏదోకటి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు.. కడుపుతో ఉన్నప్పుడు టెన్షన్ పడకూడదు .. అంటే లేదు నా కార్తీక్ నా దగ్గరకు వచ్చే వరకూ అవిశ్రాంతంగా పోరాడతాను.. ఆ దీప ఎత్తుకు పై ఎత్తువేసి.. కార్తీక్ ని నావాడిని చేసుకుంటా అంటుంది మోనిత . అప్పటి వరకూ రెస్ట్ అనేది లేదు అంటుంది మోనిత.

మోనిత మీ ఆయన గురించి కేసు పెట్టినప్పుడు మనం కూడా మోనిత పై మనం కూడా కేసు పెట్టొచ్చుగా అంటే.. ఇప్పటివరకూ ఎవరికీ ఈ విషయం తెలియదు.. కేసు పెడితే.. అత్తయ్య మామయ్య పరువు పోతుంది. అంటే భాగ్యం.. 25 వ తేదీ పెళ్లి అంటూ తీగపాకంలా సాగదీస్తా ఉంది అంటుంది. ఆ అంజి గిరించి ఎంక్వైరీ చేసి రప్పిస్తే.. చాలు పిన్ని అన్ని విషయాలు బయటకు వస్తాయి.. అంటే.. మోనిత పోలీసు కేసు పెట్టి మనకే మేలు చేసింది.. అంటే..నేను కడుగుతాయా .. ఎంతో మందికి ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు.. నన్ను పట్టుకుని అమ్మా అన్నాడు.. ఈ సేవకూడా నన్ను చేసుకొని అంటుంది భాగ్యం..

రోషిణి .. దీప మాటలను గుర్తు చేసుకుని ఎంత మాట అంది.. కడుపుకి కంప్లైంట్ కు మధ్య చాలా గడువు ఉంది.. ఇన్నాళ్లు ఏమి చేసింది. నా తో ఇన్నాళ్లు నాతో ఎవరూ ఇలా మాట్లాడింది లేదు.. అనుకుంటూ రోషిణి ఆలోచిస్తుంది.

దీపాలంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి భార్య ఇంత తప్పుచేసినా భర్తనే సమర్దిస్తుంటే.. దీప చెప్పిన మనిషి అంజి గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుంది.. అంజి డ్రైవర్ గురించి ఎంక్వైరీ మొదలు పెడుతుంది రోషిణి. ఈ కేసు చాలా చిన్నది అనుకున్నా ఇది నాకు ఛాలెంజింగ్ గా ఉంది.. ఇద్దరూ డాక్టర్లు.. డీఎన్ఏ టెస్ట్ లో తేలుతుంది అని తెలుసు.. అయినా ఇద్దరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.. మోనిత కుట్ర చేస్తుంది నా భర్త నిర్దోషి అంటుంది.. చూద్దాం.. డ్రైవర్ అంజి వలన ఏమైనా ప్రోగ్రెస్ ఉంటుందేమో అనుకుంటుంది.

ఆనందరావు కార్తీక్ .. ని మోనత పెళ్లి విషయం నిలదీస్తాడు.. మోనితను పెళ్లి చేసుకుని ఎక్కడకు తీసుకుని వెళ్తావు.. దీపని మోనిత ఇంటికి తీసుకెళ్తావా.. లేక వదిలేస్తావా.. మొత్తానికే వదిలేస్తావా.. ఇంత వరకూ నా ఇన్నేళ్ల అనుభవంలో భార్య ఇద్దరు పిల్లలు ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం కోసం భార్యని.. కన్న తల్లిని సాక్షి సంతకం కోసం పిలవడం నేను చూడలేదు.. వినలేదు అంటాడు ఆనందరావు.. ఈ రికార్డ్ నీకే సొంతం కార్తీక్..నీ భార్యని సాక్షి సంతకం అడిగే దైర్యం నీకు ఉంది.. అది నీ భార్య నిర్ణయం మీద ఆధారపడి ఉంది.. కానీ నా భార్యని సాక్షి సంతకం పెట్టమని అడిగే హక్కు నీకు ఎవరు ఇచ్చారు అంటూ కొడుకుని నిలదీస్తాడు.

నువ్వు చేయబోయే హీనమైన పనికి సంతకం చేయబోయే పనికి ..ఇద్దరు ఆత్మాభిమానం ఉన్న వీళ్ళు ఎలా వస్తారు అనుకున్నావురా అంటూ తిడుతుంటే.. దీప వారిస్తుంది. తిట్టకూడదా.. ఇంకో భార్యని తెచ్చుకుంటాడట.. అప్పుడు ఇద్దరి భార్యల ముందు తిట్టమంటావా నువ్వు మాట్లాడుకు.. ఇది మా తండ్రికొడుకుల మధ్య జరుగుతున్నా వివాదం.. అంటే నేను అనలేదు,, మోనితే కండిషన్ పెట్టింది అంటే.. నువ్వు ఏమి చేశావు.. తల ఊపావా అంటాడు ఆనందరావు.

ఏమి చేశావు.. ఏ ఇంట్లో పుట్టి పెరగవు.. ఏ కొంపలో నీ వ్యక్తిత్వాన్ని ఏ కొంపలో పోగొట్టుకున్నావు,.. దీపకి ఎందుకు అన్యాయం చేయాలనుకున్నావు అని నిలదీస్తాడు కార్తీక్ ని .. డాడీకి అసలు కారణం తెలిస్తే ఏమైపోతారో.. మోనిత ప్రెగ్నెన్సీ విషయం తెలిస్తే ఏమైపోతారో అని ఆలోచిస్తాడు.. రేపటి ఎపిసోడ్ లో మోనిత నాటకం ఓ రేంజ్ కి తీసుకెళ్లింది, దీపని అక్కా అంటూ పిలుస్తుంది.. లోపల పిల్లలున్నారు లేదంటే.. అక్క అన్నందుకు నిన్ను కుక్కని తరిమేసినట్లు తరిమేసేదానిని అంటుంది..

Also Read:

IND vs SL, 2nd ODI Preview: వన్డే సిరీస్‌పై టీమిండియా గురి.. పరువు కోసం శ్రీలంక పోరాటం!

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!