AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL, 2nd ODI Preview: వన్డే సిరీస్‌పై టీమిండియా గురి.. పరువు కోసం శ్రీలంక పోరాటం!

India vs Sri Lanka 2nd ODI Prediction: యువకులతో కూడిన టీమిండియా జట్టు నూతనోత్సాహంతో రెండో వన్డేలో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచులో విజయం సాధించి మరిన్ని రికార్డులు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు శ్రీలంక టీంకు గెలుపు చాలా అవసరం.

IND vs SL, 2nd ODI Preview: వన్డే సిరీస్‌పై టీమిండియా గురి.. పరువు కోసం శ్రీలంక పోరాటం!
IND vs SL, 2nd ODI Preview
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 9:14 AM

IND vs SL, 2nd ODI Preview: ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రోజు భారత్, శ్రీలంక టీంలు నేడు (మంగళవారం) రెండవ వన్డేలో తలపడనున్నాయి. ఫ్లడ్ లైట్ వెలుతురులో జరగనున్న రెండో వన్డేలో విజయం సాధించేందుకు ఆతిథ్య శ్రీలంక నానా కష్టాలు పడుతోంది. ఈ మ్యాచులో విజయం సాధించి స్వదేశంలో పరువు పోకుండా చూసుకోవాలని లంక ప్లేయర్లు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే టీమిండియా 3 వన్డే సిరీస్‌లో తొలి వన్డే గెలిచి ముందజంలో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని శిఖర్ ధావన సేన ఎదురుచూస్తోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే శ్రీలంకకు ఈ విజంయ చాలా కీలకంగా మారింది. లేదంటే వన్డే సిరీస్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. టీమిండియా ఈ మ్యాచులో గెలిస్తే… శ్రీలంకపై వరుసగా 14 వన్డేలు గెలిచి ప్రపంచ రికార్డును నెలకొల్పనుంది. శ్రీలంకతో జరిగిన రెండవ వన్డేలో టీం ఇండియా అన్ని రంగాల్లో ఆధిపత్యం కొనసాగించింది. 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. 2-0 ఆధిక్యంలోకి వస్తే.. సిరీస్‌ను గెలవడంతో పాటు లంకటీంపై వరుసగా 14 మ్యాచుల్లో గెలిచిన జట్టుగా రికార్డు సాధిస్తుంది.

భారత్, శ్రీలంకల మధ్య నేడు జరిగే వన్డే 161 ది. నేటి మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే శ్రీలంకపై 93 వ విజయం అవుతుంది. ఇది ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన సరికొత్త రికార్డును కూడా టీమిండియా సృష్టించనుంది.

ఓపెనర్లుగా పృథ్వీ షా, ధావన్‌ తొలి వన్డేలో దుమ్ములేపారు. పృథ్వీ షా లంక బౌలర్లపై దాడి చేసి, అన్ని వైపులా షాట్లు ఆడాడు. మరో బ్యాట్స్‌మెన్ మనీశ్‌ పాండే మాత్రం క్రీజులో ఇబ్బంది పడినట్లు కనిపించాడు. ఇక బౌలింగ్‌లో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. కృనాల్‌ పాండ్యా రాణించాడు. ఇక బౌలింగ్ త్రయం కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్, దీపక్‌ చహర్‌ అద్భుత పాత్ర పోషించారు. మరోమారు ఇదే కొనసాగితే భారత్ విజయాన్ని లంక బ్యాట్స్‌మెన్లు అడ్డుకోలేరు. మరో సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్‌ మాత్రం రాణించలేకపోయాడు. రెండవ వన్డేలో ఎటువంటి మార్పులు లేకుండానే భారత్‌ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

లంక పరిస్థితి దారుణం.. తొలి వన్డేలో లంక బ్యాట్స్‌మెన్స్ ఫర్వాలేదనిపించారు. చమిక కరుణరత్నే అద్భుత పోరాటంతో చెప్పుకొదగిన స్కోర్ చేసింది. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక కూడా ఆకట్టుకున్నారు. కెప్టెన్‌ దసున్‌ షనక, చరిత్‌ అసలంక ఫర్వాలేదనిపించినా.. భారీ స్కోర్ సాధించలేకపోయారు. మరోవైపు బౌలింగ్‌లో మాత్రం లంక జట్టు ఆకట్టుకోలేకపోయింది. ధనంజయ డిసిల్వా రెండు వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దుష్మంత చమీర ఫర్వాలేదనింపించాడు. రెండవ వన్డేలో శ్రీలంక టీం ఇసురు ఉదాన స్థానంలో లహిరు కుమార తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పిచ్, వాతావరణం ఆర్. ప్రేమదాస స్టేడియంలోనే రెండో వన్డే కూడా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ కోసం వేరే పిచ్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం కనిపిస్తోంది. రెండో వన్డేకు వర్ష సూచన లేదు.

మీకు తెలుసా? – 140 ఇన్నింగ్స్‌లలో 6000 వన్డే పరుగులు సాధించిన రెండవ వేగవంతమైన భారత బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు. హషీమ్ ఆమ్లా (123 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (136), కేన్ విలియమ్సన్ (139) మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు. – శ్రీలంక ఈ ఏడాది ఆడిన తొమ్మిది వన్డేల్లో కేవలం ఒకే ఒక్క వన్డేలో గెలిచింది. – టీ20 అంతర్జాతీయ అరంగేట్రంలో కిషన్ అర్ధ సెంచరీ సాధించాడు.

జట్ల వివరాలు (అంచనా) భారత్‌: ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్, మనీశ్‌ పాండే, సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్, దీపక్‌ చహర్, కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌. శ్రీలంక: దసున్‌ షనక (కెప్టెన్‌), అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక, భానుక రాజపక్స, ధనంజయ, చరిత్‌ అసలంక, హసరంగ, కరుణరత్నే, చమీర, సందకన్, లహిరు కుమార.

Also Read:

IND Vs SL: టీమిండియా వన్డే చరిత్రలో మొదటివాడిగా పృథ్వీ షా.. సెహ్వాగ్, రోహిత్‌లకు సాధ్యం కాని అరుదైన రికార్డు ఏంటో తెలుసా..!

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుపై భారీ ఆశలు.. మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు మీ కోసం