AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సయీద్ అన్వర్‌ను ఇబ్బంది పెట్టిన టీమిండియా పేసర్.. సచిన్‌తో మొరపెట్టుకున్న పాకిస్తానీ బ్యాట్స్‌మెన్!

On This Day In Cricket: శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓ భారతీయ బౌలర్ మాయ చేశాడు. శ్రీలంకతో టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన ఈ బౌలర్ నలుగురు బ్యాట్స్‌మెన్‌లను వెంటవెంటనే పెవిలియన్‌ చేర్చి గట్టి దెబ్బ కొట్టాడు.

సయీద్ అన్వర్‌ను ఇబ్బంది పెట్టిన టీమిండియా పేసర్.. సచిన్‌తో మొరపెట్టుకున్న పాకిస్తానీ బ్యాట్స్‌మెన్!
Debashish Mohanty
Venkata Chari
|

Updated on: Jul 20, 2021 | 10:31 AM

Share

Debashish Mohanty Birthday: దేశీయ క్రికెట్‌లో ఒడిశా తరుపున ఆడిన దేభాషిష్ మొహంతి.. ఇండియన్ క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. బలహీన జట్టుగా ఉన్న ఒడిషాలో బలమైన గుర్తింపు సాధించాడు. అలాగే భారత్ తరపున ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. టీమిండియా తరపున దాదాపు 50 మ్యాచ్‌లు ఆడాడు. 1999 ప్రపంచ కప్‌లో, జవగల్ శ్రీనాథ్ తర్వాత భారతదేశానికి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దేబాషిష్ 20, జులై 1976 న భువనేశ్వర్ లో జన్మించాడు. ఒడిశా కోసం ఒక సీజన్ మాత్రమే ఆడి, టీమిండియాకు వచ్చాడు. శ్రీలంకతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 1997 లో ఆడిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దేబాషిష్ మొహంతి నాలుగు వికెట్లు పడగొట్టి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, రెండవ టెస్టు ఆడేందుకు దాదాపు మూడు నెలల సమయం పట్టింది. దురదృష్టవశాత్తు రెండవ టెస్టే మొహంతి కెరీర్‌లో చివరి టెస్టు కావడం గమనార్హం. మొహాలిలో శ్రీలంకతో ఈ టెస్ట్ ఆడాడు. రెండవ టెస్టులో వికెట్లు తీసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితిలో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత టీమిండియా నుంచి మరలా పిలుపునందుకోలేదు.

మొహంతి బౌలింగ్‌పై సచిన్‌తో  మొర పెట్టుకున్న సయీద్ అన్వర్..  టెస్టుల్లో విఫలమైన మొహంతి వన్డేల్లో మాత్రం తన మార్క్‌ని చూపించడంలో విజయవంతమయ్యాడు. 45 వన్డేలు ఆడిన మొహంతి 57 వికెట్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 56 పరుగులుచ్చి నాలుగు వికెట్లు. 1997 లో టొరంటోలో జరిగిన సహారా కప్‌లో పాకిస్థాన్‌పై వన్డేలో అరంగేట్రం చేశాడు. ఈ టోర్నమెంట్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి ఎనిమిది వికెట్లు తీశాడు. రెండవ వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి… టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సయీద్ అన్వర్‌ను మొహంతి చాలా ఇబ్బంది పెట్టాడు. దాంతో మొహంతి బౌలింగ్‌పై సచిన్‌తో మొరపెట్టుకున్నాడంట అన్వర్. అలా టీమిండియాలో తనదైన మార్క్ చూపించాడు మొహంతి.

25 సంవత్సరాల వయస్సులో జట్టు నుంచి.. మొహంతి మరలా 1999 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగాడు. ఇందులో ఆరు మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. జవగల్ శ్రీనాథ్ (12) తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండవ వ్యక్తిగా పేరుగాంచాడు. మొహంతి.. శ్రీనాథ్ కంటే రెండు మ్యాచ్‌లు తక్కువ ఆడడం విశేషం. ప్రపంచ కప్ తరువాత 2001 లో భారత్ తరఫున తన చివరి వన్డే ఆడాడు. 25 ఏళ్లకే టీమిండియా నుంచి తప్పుకోవడం బాధాకరం.

Also Read:

Viral Photo: 2 కోట్ల లైకులతో ఇన్‌స్టా ఫొటో రికార్డు.. రొనాల్డోను బీట్ చేసిన అర్జెంటీనా స్టార్ ప్లేయర్!

IND vs SL, 2nd ODI Preview: వన్డే సిరీస్‌పై టీమిండియా గురి.. పరువు కోసం శ్రీలంక పోరాటం!