Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SL: టీమిండియా వన్డే చరిత్రలో మొదటివాడిగా పృథ్వీ షా.. సెహ్వాగ్, రోహిత్‌లకు సాధ్యం కాని అరుదైన రికార్డు ఏంటో తెలుసా..!

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అరుదైన రికార్డు నెలకొల్పాడు. బౌండరీల మోత మోగిస్తూ.. శ్రీలంక బౌలర్లపై సత్తా చూపాడు. టీమిండియా కెప్టెన్, సీనియర్ ఓపెనర్ ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.

IND Vs SL: టీమిండియా వన్డే చరిత్రలో మొదటివాడిగా పృథ్వీ షా.. సెహ్వాగ్, రోహిత్‌లకు సాధ్యం కాని  అరుదైన రికార్డు ఏంటో తెలుసా..!
Prithvi Shaw, Sehwag, Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jul 20, 2021 | 7:52 AM

IND Vs SL: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అరుదైన రికార్డు నెలకొల్పాడు. బౌండరీల మోత మోగిస్తూ.. శ్రీలంక బౌలర్లపై సత్తా చూపాడు. టీమిండియా కెప్టెన్, సీనియర్ ఓపెనర్ ధవన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. పృథ్వీ షా 24 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో 9 ఫోర్లు ఉన్నాయి. వరుసగా ఫోర్లతో లంక బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. క్రీజులో ఉన్న కొద్దిసేపైనా.. ఓవర్‌కు రెండు లేదా మూడు ఫోర్ల చొప్పున బాదాస్తు చుక్కలు చూపించాడు. పృథ్వీ షా ధాటికి ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు సాధించింది. ఇందులో ధవన్ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో పృథ్వీ షా ఓ రికార్డును సాధించాడు. అదికూడా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్లకు సాధ్యం కాని ఓ రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు.

టీమిండియా వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. 2002 నుంచి చూస్తే.. ఇన్నింగ్స్ మొదటి ఐదు ఓవర్లలో 43 పరుగులు ఏ భారత బ్యాట్స్‌మన్‌ కూడా బాదలేదు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఐదు ఓవర్లలో కేవలం 38 పరుగులు మాత్రమే సాధించాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఇలాంటి ఘనత సాధ్యం కాకపోవడం గమనార్హం. మరికొద్దిసేపు క్రీజులో పృథ్వీ షా ఉండి ఉంటే మరెన్ని రికార్డులు బద్దలయ్యోవో మరి. కానీ ఆవెంటనే ఔటయ్యాడు.

263 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు పృథ్వీ షా 43, ధావన్‌ 95 బంతుల్లో 86 నాటౌట్( 6 ఫోర్లు, సిక్స్‌) అద్భుతంగా ఆడారు. అనంతరం అరంగేట్రం చేసిన యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌ 42 బంతుల్లో 59 పరుగులు (8 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్ 20 బంతుల్లో 31 నాటౌట్‌(5 ఫోర్లు) రాణించడంతో టీమిండియాకు తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే నేడు ఆర్. ప్రేమదాస స్డేడియం వేదికగా జరుగనుంది.

Also Read:

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుపై భారీ ఆశలు.. మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు మీ కోసం

Krunal Pandya : అది కృనాల్‌ పాండ్య స్పిరిట్..! రాహుల్ ద్రావిడ్ ఎఫెక్ట్.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..

Ishan Kishan: అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికి సిక్సర్‌.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఇషాన్ కిషన్