Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుపై భారీ ఆశలు.. మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు మీ కోసం

Tokyo Olympics: కోట్లాది మంది క్రీడాభిమానుల ఆశలను భారత హాకీ జట్టు టోక్యోకు మోసుకెళ్లింది. ఒలంపిక్స్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు పతకాలు తప్పక గెలుస్తాయని క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుపై భారీ ఆశలు.. మ్యాచ్‌ల షెడ్యూల్ వివరాలు మీ కోసం
Indian Hockey Team
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 19, 2021 | 6:24 PM

India Hockey Team: కోట్లాది మంది క్రీడాభిమానుల ఆశలను భారత హాకీ జట్టు టోక్యోకు మోసుకెళ్లింది. ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు పతకాలు తప్పక గెలుస్తాయని క్రీడాభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు తలపడే మ్యాచ్‌ల షెడ్యూల్ ఏంటో తెలుసుకోండి. మ్యాచ్ డేట్స్‌ను నోట్ చేసుకోండి.  టోక్యో ఒలింపిక్స్‌లో గ్రూప్ ఏలో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ హాకీ జట్టు తలపడనుంది. ఈ నెల 24న ఉదయం 6.30 గం.లకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండో మ్యాచ్‌లో జులై 25న మధ్యాహ్నం 3 గం.లకు భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత్ మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌తో జులై 27న ఉదయం 6.30 గం.లకు ఢీకొంటుంది. 29న ఉదయం 6.30 గం.లకు అర్జెంటీనాతో తలపడనుండగా…జులై 30న మధ్యాహ్నం 3 గం.లకు జపాన్‌తో భారత్ తలపనుండి.

హాకీ పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 1న జరగనుండగా..సెమీస్ మ్యాచ్ ఆగస్టు 3 తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 5న జరగనుంది. అదే రోజు కాంస్య పతకం కోసం హాకీ మ్యాచ్ నిర్వహిస్తారు.

ఇదిలా ఉండగా భారత హాకీ మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో నెథర్లాండ్స్‌తో జులై 24న తలపడనుంది. 26న జర్మనీ, 28న బ్రిటన్, 30న ఐర్లాండ్, 31న దక్షిణాఫ్రికా జట్లతో భారత్ తలపడుతుంది. ఆగస్టు 2న క్వార్టర్ ఫైనల్, 4న సెమీ ఫైనల్, 6న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఆగస్టు 6 తేదీ నాడే కాంస్య పతకం కోసం మ్యాచ్ ఉంటుంది.

Also Read..

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే జంటలు వీరే.. భారత్ నుంచి కూడా..!

వెయిట్ లిఫ్టింగ్‌లో 20 ఏళ్ల నిరీక్షణకు అడ్డుకట్టపడేనా? భారీ అంచనాలతో మీరాబాయి చాను బరిలోకి!