AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Srikanth: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్.. బాలయ్య సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తిపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్న శ్రీకాంత్ ఇప్పుచు విలన్ గా భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు.

Hero Srikanth: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్.. బాలయ్య సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Shreekanth
TV9 Telugu Digital Desk
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 20, 2021 | 10:34 AM

Share

Hero Srikanth: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఆకట్టుకున్న శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నాగచైతన్య నటించిన యుద్ధం శరణం మూవీలో శ్రీకాంత్ విలన్ గా నటించారు. ఇప్పుడు మరోసారి విలన్ గా నటించడానికి సిద్ధం అయ్యారు. నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలో శ్రీకాంత్ బాలయ్యను ఢీ కొట్టే పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా శ్రీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ.. బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్ గా నటిస్తున్నానని తెలిపారు. అలాగే బాలయ్య నటించిన శ్రీరామరాజ్యంలో రామలక్ష్మణులుగా నటించిన మేము అఖండలో హీరో విలన్లుగా తలపడనున్నాం అని అన్నారు. అలాగే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రోషన్ హీరోగా పెళ్ళిసందడి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. రోషన్ పెళ్లి సందడి సినిమా షూటింగ్ పూర్తైంది. ఒకటి రెండు నెలల్లో పెళ్లి సందడి సినిమా విడుదల చేస్తారు అని తెలిపారు.

దాదాపు 100 సినిమాలకు పైగా హీరోగా నటించిన శ్రీకాంత్ ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడ్డారు. హీరోగా క్లాస్ మాస్ ఆడియన్స్ ను అలరించిన ఈ సీనియర్ హీరో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు. మెగా హీరో రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అలాగే అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో బన్నీకి బాబాయ్ గా నటించి అలరించారు. ఇక ఇప్పుడు విలన్ గా నటించి భయపెట్టడానికి సిద్ధమయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam: అంజి విషయంలో ఎంక్వైరీ మొదలు పెట్టిన రోషిణి.. కార్తీక్ ని పెళ్లి చేసుకునేందుకు ఎంతకైనా వెళ్తానంటున్న మోనిత

Narappa Movie Review: ఆకట్టుకుంటోన్న నారప్ప మూవీ… వెంకీ వన్ మ్యాన్ షో.

Nidhi Agarwal: ఆ పాత్రకు అతను తప్ప మరెవరు న్యాయం చేయలేరు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్మార్ట్‌ బ్యూటీ.