AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhi Agarwal: ఆ పాత్రకు అతను తప్ప మరెవరు న్యాయం చేయలేరు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్మార్ట్‌ బ్యూటీ.

Nidhi Agarwal: దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సరైన హిట్‌లు లేక సతమతమవుతోన్న సమయంలో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'. పూరీ కమ్‌ బ్యాక్‌ మూవీగా వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్‌ విజయాన్ని సొంతం చేసుకుంది...

Nidhi Agarwal: ఆ పాత్రకు అతను తప్ప మరెవరు న్యాయం చేయలేరు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్మార్ట్‌ బ్యూటీ.
Nidhi Agarwal
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 20, 2021 | 7:44 AM

Share

Nidhi Agarwal: దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సరైన హిట్‌లు లేక సతమతమవుతోన్న సమయంలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూరీ కమ్‌ బ్యాక్‌ మూవీగా వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక హీరో రామ్‌ కెరీర్‌లోనూ ఈ సినిమా పెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాలో నటించిన అందాల భామలు నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. తమ గ్లామర్‌తో ఈ ఇద్దరు హీరోయిన్లు కుర్రకారును ఫిదా చేశారు. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ కూడా యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాన్ని రీమేక్‌ చేస్తే బాగుంటుందని నిధి చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా రీమేక్‌ చేస్తే రామ్‌నే హీరోగా తీసుకోవాలని తాను భావిస్తున్నట్లు నిధి తెలిపింది. రామ్‌ తప్ప మరెవరు ఆ పాత్రకు న్యాయం చేయలేరని నిధి అభిప్రాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇస్మార్ట్‌ శంకర్‌ రీమేక్‌ కోసం ఎవరూ ప్రయత్నం చేయకుండా రామ్‌నే హీరోగా తీసుకోవాలని తేల్చి చెప్పారు నిధి. తెలుగులో సంచలన విజయం నమోదు చేసుకున్న ఇస్మార్ట్‌ శంకర్‌ హిందీలోనూ బంపర్‌ హిట్‌ అవుతుందని నిధి భావిస్తున్నారు. మరి ఈ అందాల భామ చెబుతోన్న మాటలను మేకర్స్‌ పరిగణలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాలి. ఇక ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం తర్వాత నిధి కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏకంగా పవన్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరి హర వీరమల్లు సినిమాలో నిధి నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: Raj Kundra Arrest: శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌.. యాప్స్‌ ద్వారా పోర్న్‌ సినిమాలు విడుదల చేశారంటూ..

Indian Actress: నయా రూటులో సుందరాంగులు.. సడెన్ ఛేంజ్ వెనుక రీజన్ ఏంటో..?

Tollywood: ఇండస్ట్రీలో నయా స్టైల్ గురూ..! పెట్‌ లేనిదే ఫోటోలు దిగడం లేదుగా