Narappa Movie Review: ఆకట్టుకుంటోన్న నారప్ప మూవీ… వెంకీ వన్ మ్యాన్ షో.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. తమిళ్ లో సూపర్ హిట్ అయినా అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది.

Narappa Movie Review: ఆకట్టుకుంటోన్న నారప్ప మూవీ... వెంకీ వన్ మ్యాన్ షో.
Narappa
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: uppula Raju

Updated on: Jul 20, 2021 | 8:53 PM

చిత్రం: నారప్ప

నటీనటులు: వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, నాజర్‌, రాజీవ్‌ కనకాల, అమ్ము అభిరామ్‌ తదితరులు

సంగీతం: మణిశర్మ

నిర్మాత: కలైపులి ఎస్‌.థాను, డి.సురేశ్‌బాబు

 స్క్రీప్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం నారప్ప. తమిళ్ లో సూపర్ హిట్ అయినా అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. వెంకటేష్ డిఫరెంట్ గెటప్ లో ఈ సినిమాలో కనిపించరు. ఈ సినిమా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది.

కథ :

అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో హాయిగా జీవితం సాగిస్తుంటారు నారప్ప (వెంకటేష్ ) సుందరమ్మ(ప్రియమణి). నారప్పకు మునికన్నా(కార్తీక్‌ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) ముగ్గురు పిల్లలు. ఆ ఉరి పెద్ద పండు స్వామి(నరేన్‌) తన తమ్ముడికోసం ఊరిలో ఉన్న పేదల భూములను తీసుకుంటూ ఉంటాడు. అయితే నారప్ప మాత్రం తన భూమిని ఇవ్వడు. ఈ క్రమంలో మునికన్నా పండుస్వామితో గొడవపడి అతడిని అవమానిస్తాడు. దాంతో పండుస్వామి మునికన్నాను దారుణంగా హత్య చేయిస్తాడు. అన్నను చంపారన్న కోపంతో సిన్నబ్బ పండుస్వామిని హత్యచేస్తాడు. ఆతర్వాత నారప్ప కుటుంబాన్ని హత్య చేయాలనీ పండుస్వామి మనుషులు చూస్తారు. అప్పుడు నారప్ప ఏం చేశాడు అన్నది మిగిలిన కథ..

డబ్బున్న వాడికి పేదవాడిని మధ్య జరిగే పోరాటం నారప్ప సినిమా. ‘భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు’ అంటూ’ చదువు గొప్పతనాన్ని వివరిస్తూ సాగిన కథ ఇది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్ లో వచ్చిన అసురన్ సినిమా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ లో ఉన్న ఎమోషన్ ను ఎక్కడ మిస్ అవ్వకుండా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. కథను చాలా చక్కగా ప్రేక్షులకు కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పాలి. ఇక వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రధాన ఆకర్షణ. ఆయన కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించారు. మొదటి భాగం కాస్త నెమ్మదిగా అనిపించినప్పటికీ మునికన్నా హత్య తర్వాత సినిమా వేగం అందుకుంటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

నారప్ప సినిమా వెంకటేష్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమాను మొత్తం తన భుజాలపై వేసుకున్నారు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియార్టీ కనిపిస్తుంది. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లో వెంకీ అదరగోటేశారు. ప్రియమణి, కార్తీక్‌రత్నం, రాజీవ్‌ కనకాల, రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. అలాగే దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి రీమేక్‌ను ఎంచుకున్నారు. ఎమోషనల్ సన్నివేశాలు అన్నీ కన్నీళ్లు తెప్పిస్తాయి.

చివరగా : ఆకట్టుకున్న నారప్ప

మరిన్ని ఇక్కడ చదవండి :

Nidhi Agarwal: ఆ పాత్రకు అతను తప్ప మరెవరు న్యాయం చేయలేరు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్మార్ట్‌ బ్యూటీ.

Amala Paul: వైరల్ అవుతోన్న అమలాపాల్‌ లేటెస్ట్‌ ఫొటో షూట్‌.. అందంతో మతి పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ..