Boyapati Srinu : యాక్షన్ హీరోతో బోయపాటి భారీ ప్లాన్.. బాలయ్య సినిమా తర్వాత ఆ హీరోతోనేనా..?

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నా .. ఎక్కువ ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న పేరు బోయపాటి శ్రీను. నట సింహం బాలకృష్ణ తో వరుసగా రెండు సంచలన విజయాలను అందుకొని ఇప్పుడు...

Boyapati Srinu : యాక్షన్ హీరోతో బోయపాటి భారీ ప్లాన్.. బాలయ్య సినిమా తర్వాత ఆ హీరోతోనేనా..?
Boyapati
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 20, 2021 | 10:19 AM

Boyapati Srinu : టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నా .. ఎక్కువ ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న పేరు బోయపాటి శ్రీను. నట సింహం బాలకృష్ణ తో వరుసగా రెండు సంచలన విజయాలను అందుకొని ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు. రవితేజ నటించిన భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. చేసినవి ఎనిమిది సినిమాలే అయినప్పటికీ మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. వెంకటేష్ హీరోగా తులసి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దమ్ము, అల్లు అర్జున్ తో సరైనోడు , బాలయ్యతో సింహ, లెజెండ్ , బెల్లంకొండ శ్రీనివాస్ తో జయజానకి నాయక వంటి సినిమాలను తెరకెక్కించాడు బోయపాటి. ఇక ఇప్పుడు బాలయ్యతో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యను రెండు డిఫరెంట్ గెటప్స్ లో చూపించనున్నాడు బోయపాటి. అందులో ఒకటి అఘోర పాత్ర అవ్వడం విశేషం.

ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి ఎవరితో సినిమా చేయనున్నాడన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో తమిళ్ హీరోతో బోయపాటి నెక్స్ట్ సినిమా అంటూ టాక్ వినిపిస్తోంది. తమిళ్ హీరో విశాల్ హీరోగా బోయపాటి  ఓ భారీ యాక్షన్ చిత్రానికి సన్నాహాలు చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.కోలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోను విశాల్ కు మాస్ హీరోగా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ పై ఇండస్ట్రీలో  ఆసక్తికర చర్చ జరుగుతుంది. విశాల్ మాస్ ఇమేజ్ కు తగ్గ ఓ భారీ యాక్షన్ స్క్రిప్ట్ ని బోయపాటి సిద్దం చేసినట్లు సమాచారం. రచయిత ఎం రత్నం ఈ సినిమాకు కథ- మాటలు అందిస్తున్నారుట. ఇక దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తుంది. అఖండ సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam: అంజి విషయంలో ఎంక్వైరీ మొదలు పెట్టిన రోషిణి.. కార్తీక్ ని పెళ్లి చేసుకునేందుకు ఎంతకైనా వెళ్తానంటున్న మోనిత

Sankalp Reddy: బాలీవుడ్‌‌‌‌‌లోకి అడుగు పెడుతున్న మరో టాలీవుడ్ డైరెక్టర్..