AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Benefits: ఉల్లిపాయ చేసే మేలు తెలిస్తే షాకవుతారు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

Health Benefits of Onions: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.. అనే సామెతను మనం తరచూ వింటుంటాం. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు, పోషకాల వల్ల ఇలా

Onion Benefits: ఉల్లిపాయ చేసే మేలు తెలిస్తే షాకవుతారు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
Health Benefits of Onions
Shaik Madar Saheb
|

Updated on: Jul 20, 2021 | 6:33 AM

Share

Health Benefits of Onions: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.. అనే సామెతను మనం తరచూ వింటుంటాం. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు, పోషకాల వల్ల ఇలా పేర్కొంటుంటారు. వీటిలో అనేక ఔషధాలతోపాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సల్ఫర్‌ లాంటివి ఉన్నాయి. అవన్నీ చాలామందికి తెలియకపోయినా.. ఉల్లిని ప్రతి ఒక్కరూ ఆహారంలో ఉపయోగిస్తుంటారు. ఉల్లి లేకుండా కూర చేయడం మాత్రం అస్సలు జరిగే పనే కాదు. కంట్లో నుంచి నీరు వస్తున్నా సరే.. వాటిని కట్ చేసి కూరల్లో వేస్తాం. అలాంటి ఉల్లిపాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఈ పోషకాలు మనం ఆరోగ్యవంతంగా ఉండటంలో సాయపడతాయి.

అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనం పలు రోగాల బారిన పడకుండా అడ్డుకుంటాయి. అందుకే ఉల్లిపాయలను కూరల్లో వేసే కన్నా పచ్చిగా తింటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అందుకే చాలామంది పచ్చి ఉల్లిని కూడా తింటారు. కొంతమంది పెరుగన్నంలో పచ్చి ఉల్లి తింటారు. అసలు ఉల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు.. ∙ ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ∙ ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. కావున క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ∙ మూత్ర సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. ∙ ఉల్లిపాయలోని గుణాలు రక్తం గడ్డకట్టకుండా, రక్త సంబంధిత సమస్యలను నివారిస్తాయి. ∙ దంతక్షయాన్ని, దంతాల్లో ఉండే ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి ఉల్లిపాయ సహాయపడుతుంది. ∙ పచ్చి ఉల్లిపాయని నమిలితే నోటిలో ఉండే కీటకాలు, జెర్మ్స్ నశించిపోతాయి. ∙ ఆర్థరైటిస్, కీళ్ల నోప్పుల నుంచి ఉపశమనం కలిగించేలా చేస్తాయి. ∙ శరీరంలో వేడిని నియంత్రించి చలవ చేసేలా చేస్తుంది. ∙ ఉల్లిపాయ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గించి.. రక్తపోటును నివారిస్తుంది. ∙ ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉల్లిపాయ సహాయపడుతుంది. ∙ అందుకే ప్రతిరోజూ ఉల్లిపాయలను తినాలని సూచిస్తుంటారు నిపుణులు..

Also Read:

Heart Problem: యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు.. ఈ పద్దతులు మార్చుకుంటే సులువుగా బయటపడొచ్చు..

Skin Care : చర్మం మెరుస్తూ ఉండాలంటే ఈ 3 తప్పులు అస్సలు చేయొద్దు..! ఏంటో తెలుసుకోండి..