Disadvantages Of Eating Paan: తమలపాకులు తింటున్నారా? ఇది తెలిస్తే ఇక ఆ పని చేయరేమో..!
Disadvantages Of Eating Paan: తమలపాకులు తింటున్నారా? ఇది తెలిస్తే ఇక ఆ పని చేయరేమో..! మన దేశంలో తమలపాకులు తెలియని వారు..
Disadvantages Of Eating Paan: తమలపాకులు తింటున్నారా? ఇది తెలిస్తే ఇక ఆ పని చేయరేమో..! మన దేశంలో తమలపాకులు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు చాలా మందికి తమలపాకులు, పాన్‌లను తినే అలవాటు ఉంటుంది. తమలపాకులను తినకుండా ఉండలేనివారు కూడా ఉంటారు. అందుకే మనం దేశంలో పాన్ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, వీటిని పరిమితంగా తింటేనే ఈ ప్రయోజనం కలుగుతుంది. అతిగా తింటే మాత్రం నష్టం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని అధికంగా తినడం వలన చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుందంటున్నారు. తమలపాకులను ఎక్కువగా తినడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. అలెర్జీ: తమలపాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీ సమస్య వస్తుంది. తమలపాకు అధికంగా తినడం వల్ల కొందరికి చర్మంపై దద్దుర్లు, దురదలు, ఎర్రగా మారుతుంటాయి. 2. చిగుళ్లలో నొప్పి: తమలపాకును ఎక్కువగా తినడం వల్ల చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్ అవుతుంది. తీవ్రమైన నొప్పి వస్తుంది. చిగుళ్ళు, దవడలలో వాపు వచ్చి.. నొప్పి కలుగుతుంది. 3. బీపీ పెరుగుతుంది: తమలపాకులు ఎక్కువగా తింటే హైబీపీ సమస్య వస్తుంది. ఇది అధిక రక్తపోటు, అసాధారణ హృదయ స్పందనలకు దారితీస్తుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. 4. హార్మోన్ల అసమతుల్యత: పాన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తమలపాకులను ఎక్కువగా తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది. 5. ప్రెగ్నెన్సీ సమస్యలు: తమలపాకులను ఎక్కువగా తినడం వల్ల గర్భధారణపై ప్రభావం పడుతుంది. ఇది గర్భంలో పిండం, దాని అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇది పిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. 6. నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం: తమలపాకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మార్కెట్‌లో దొరికే పాన్‌లో కూడా పొగాకు ఉపయోగించబడుతుంది. ఇది హానికరమైనది.
గమనిక: ఆరోగ్య నిపుణులు పేర్కొన్న అభిప్రాయలను ప్రజాహితార్థం పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..