Vitamin A: మీ కళ్ల చుట్టు నల్లని వలయాలున్నాయా? ఐతే ఇది కారణం కావచ్చు..

ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు తగుమోతాదులో శరీరానికి అవసరం. వీటిల్లో ఏది లోపించినా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఎముకలను త్వరగా బలహీనపరుస్తుంది. కాబట్టి మన రోజువారీ..

Vitamin A: మీ కళ్ల చుట్టు నల్లని వలయాలున్నాయా? ఐతే ఇది కారణం కావచ్చు..
Vitamin A Deficiency
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 17, 2022 | 9:52 PM

Vitamin A Deficiency: ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలు తగుమోతాదులో శరీరానికి అవసరం. వీటిల్లో ఏది లోపించినా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఎముకలను త్వరగా బలహీనపరుస్తుంది. కాబట్టి మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు, పీచుపదార్థాలు, విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ లోపం తలెత్తితే కళ్ళు మొదటిగా ప్రభావితం అవుతాయి. ఈ విటమిన్‌ను శరీరం నేరుగా ఉత్పత్తి చేయలేదు. ఖచ్చితంగా ఆహారం ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

విటమిన్ ‘ఏ’ లోపం వల్ల తలెత్తే సమస్యలు ఇవే.. ప్రాథమికంగా విటమిన్ ‘ఏ’ లోపిస్తే దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా కళ్లు అస్పష్టంగా కనిపించడం, కళ్ళు పొడిబారడం, కార్నియల్ దెబ్బతిని చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మనశరీరంలో విటమిన్ ‘ఏ’ తలెత్తగానే మొదటి సంకేతంగా కన్పించేది.. కళ్ల చుట్టు నల్లని వలయాలు ఏర్పడటం. ఎప్పుడైతే శరీరానికి పుష్కలంగా ఈ విటమిన్‌ అందుతుంటే అప్పుడు సాధారణ స్థితికి వస్తుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. విటమిన్ ‘ఏ’ లోపించిన వారిలో తామర, డ్రైస్కిన్‌ వంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి. అలాగే పిల్లల్లో ఎదుగుదల సమస్యలు తలెత్తుతాయి. వారి ఎదుగుదలపై దీని ప్రభావితం నేరుగా పడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆహారాల్లో విటమిన్‌ ‘ఏ’ అధికంగా ఉంటుంది.. టమాట, ఆకుకూరలు, అలాగే క్యారెట్‌, చిలగడ దుంప, గుమ్మడి, మామిడి, లివర్‌, చేపలు, పాలు, గుడ్ల వంటి ఆహారంలో విటమిన్‌ ‘ఏ’ పుష్కలంగా ఉంటుంది.