Elon Musk: ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మస్క్ వార్నింగ్! ‘ఇది పద్ధతి కాదు.. వెంటనే ఆపండి..’
స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ - ట్విటర్ మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మస్క్ వార్నింగ్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది..
Elon Musk sent a text to Twitter CEO Parag Agrawal: స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ – ట్విటర్ మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఎలన్ మస్క్ వార్నింగ్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ఐతే ట్విటర్ సంస్థను ఏవిధంగా కొనుగోలు చేయాలనుకుంటున్నారనే దానిపై ఆ సంస్థ న్యాయవాదులు ఆరా తీస్తున్నారని, ఫైనాన్స్ ఎక్కడి నుంచి పొందుతున్నానని ప్రశ్నిస్తున్నారని, తద్వారా తనకు ఇబ్బంది కలుగజేస్తున్నట్లు, వెంటనే దాన్ని ఆపాలని పేర్కొంట్లు జూన్ 28న టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు ఓ బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక పేర్కొంది. కాగా ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాలంటూ మస్క్‌పై ఇటీవలే ఆ సంస్థ కోర్టులో దావా వేసింది. దీంతో ఇరు పక్షాల మధ్య సుదీర్ణ న్యాయపోరాటానికి నాంది పలికినట్లయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో ట్విట్టర్‌లో 9.2 శాతం వాటా కలిగివున్న ఎలోన్ మస్క్ ట్విటర్ డైరెక్టర్ల బోర్డులో చేరనున్నట్లు ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకటించారు.
ఐతే ఈ ఆఫర్‌ను తిరస్కరించిన ఎలన్ మస్క్, అందుకు బదులుగా కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు. ఐతే ఆ తర్వాత కొనుగోలు నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నాడు. దీంతో మాటమార్చిన మస్క్‌పై ట్విటర్ షేర్ హోల్డర్లు ఫెడరల్ సెక్యూరిటీస్ క్లాస్ యాక్షన్ కింద దావా వేశారు. దీనిపై మస్క్ మండిపడ్డారు. విచారణకు నెలల సమయం పట్టవచ్చని, ట్విటర్ కావాలనే నకిలీ ఖాతాల సమాచారాన్ని నొక్కిపెట్టి ఉంచిందని, మస్క్‌కు తెలియకుండా మేనేజర్లను తొలగించడం ద్వారా కొనుగోలు ఒప్పందాన్ని ట్విట్టర్ఉల్లంఘించిందన్న ఆరోపణలతో.. మస్క్ తరఫు న్యాయవాదులు డెలావర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో మేమే విజయం సాధిస్తామని ఇరువర్గాల లాయర్లు సవాళ్లు విసురుకుంటున్నారు.