Gold Rate in Hyderabad: బంగారం ప్రియులకు బంపరాఫర్! మరికొంత తగ్గిన గోల్డ్‌ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..

మగువలకు గుడ్ న్యూస్‌! పుత్తడి ధరలు నేడు (జులై 18) మరికొంత దిగివచ్చాయి. నిన్న (ఆదివారం) బంగారం ధర భారీగా దిగొచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..

Gold Rate in Hyderabad: బంగారం ప్రియులకు బంపరాఫర్! మరికొంత తగ్గిన గోల్డ్‌ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..
Gold Price Today
Follow us

|

Updated on: Jul 20, 2022 | 6:22 AM

Gold Rate in Hyderabad on 18th July 2022: మగువలకు గుడ్ న్యూస్‌! పుత్తడి ధరలు నేడు (జులై 18) మరికొంత దిగివచ్చాయి. నిన్న (ఆదివారం) బంగారం ధర భారీగా దిగొచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,400లు ఉంది. ఐతే ఈ రోజు (సోమవారం) నాటికి ధరల్లో రూ.10ల మేర తగ్గి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ.50,390ల వద్ద కొనసాగుతున్నాయి. 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,619లు, 24 క్యారెట్ల బంగారం రూ.5,039లు ఉంది.

బంగారం ధర ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, చెన్నై, లక్నో వంటి ఇతర రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబాయి రాష్ట్రాల్లో వరుసగా ధరలు రూ.46,190, రూ.50,390 ఉన్నాయి. ఇక పూణెలో కొద్దిమేర తేడాతో రూ.46,270, రూ.50,470 రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,260లు, 24 క్యారెట్ల బంగారం రూ.50,470గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,390లు ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,390లు ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి.

తగ్గేదేలే అంటున్న వెండి..!

ఇవి కూడా చదవండి

వెండి ధరలు మాత్రం ఆదివారం మాదిరిగానే ఈ రోజు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జులై 18) బులియన్‌ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.55,600లు వద్ద స్థిరంగా ఉంది. ఒక గ్రాము వెండి రూ.55.60లుగా ఉండగా, 10 గ్రాముల వెండి ధర రూ.556లు, 100 గ్రాముల వెండి ధర రూ.5,560లు ఉంది. విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో కేజీ వెండి రూ.60,700లు పలుకుతోంది. మొత్తంగా వెండి ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!