Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Booster: శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో ఈ 5 ఆహార పదార్థాలు ఉండాల్సిందే..!

Immunity Booster: చలికాలం అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ, వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు వంటి సాధారణ రుగ్మతలు తలెత్తుతుంటాయి.

Immunity Booster: శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో ఈ 5 ఆహార పదార్థాలు ఉండాల్సిందే..!
Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 21, 2021 | 9:20 AM

Immunity Booster: చలికాలం అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ, వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు వంటి సాధారణ రుగ్మతలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తీవ్రమైన చలిని తట్టుకోవాలన్నా.. కాలానుగుణమైన మార్పులను తట్టుకోవాలన్నా రోగ నిరోధక శక్తి అవసరం. రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా మీ డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు.. 1. వెల్లుల్లి చాలా మంది గర్భిణీ స్త్రీలు గ్యాస్, ఉబ్బరం సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే వెల్లుల్లి తినవచ్చు. వెల్లుల్లిలో సల్ఫర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్‌ను తొలగించడమే కాకుండా శరీరానికి వేడిని అందిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పని చేస్తుంది.

2. అల్లం ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. మార్నింగ్ సిక్నెస్, వికారాన్ని తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అల్లం ను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇతర ఉదర సంబంధమైన సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే, శరీరాన్ని వేడిగా ఉంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. అందుకే మీరు తీసుకునే ఆహారంలో అల్లం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడం మంచిది.

3. పసుపు పసుపులో యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. చలికాలంలో పసుపు పాలు తాగితే గర్భిణుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శీతాకాలంలో గర్భధారణ సమయంలో జలుబు, దగ్గు నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

4. గూస్బెర్రీ ఈ పండు సహజమైన డిటాక్సిఫైయర్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్ గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకం. ఈ పండులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కావున.. మీరు తినే ఫుడ్ లిస్ట్‌లో ఈ పండును కూడా చేర్చుకోవడం ఉత్తమం. ఇందులో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5. ఆవు పాలు రోజూ ఒక గ్లాసు ఆవు పాలు తాగడం వల్ల చలికాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే లాక్టోఫెర్రిన్ అనే మూలకం వైరస్‌ల బారిన పడకుండా కాపాడుతుంది. ఈ మూలకం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి గ్లాస్ ఆవు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

Also read:

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

Dalailama: మత సామరస్యం విషయంలో భారత్‌ ప్రపంచానికే మార్గదర్శి.. ఇక్కడి ప్రజల జీవనం నన్నెంతగానో ఆకట్టుకుంటోంది: దలైలామా

UP Politics: హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం.. జనంలోకి బీజేపీ.. సీఎం యోగిను టార్గెట్ చేసిన అఖిలేశ్‌, ప్రియాంక!