Brinjal Benefits: టైప్ 2 డయాబెటిస్‌కు దివ్యౌషధం ‘వంకాయ’.. అందులోని పోషకాల విలువ తెలిస్తే అవాక్కవుతారు..!
Brinjal Benefits: ప్రస్తుత బిజీ ప్రపంచంలో జీవన శైలి మార్పు కారణంగా చాలా మంది ప్రజలు మధుమేహం(డయాబెటీస్) బారిన పడుతున్నారు.
Brinjal Benefits: ప్రస్తుత బిజీ ప్రపంచంలో జీవన శైలి మార్పు కారణంగా చాలా మంది ప్రజలు మధుమేహం(డయాబెటీస్) బారిన పడుతున్నారు. ఒకసారి మధుమేహం బారిన పడితే.. జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. మధుమేహం.. ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే కాదు.. ప్రాణాలను హరిస్తుంది. అందుకే.. డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం నిత్యం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అయితే మధుమేహం అదుపులో ఉంచడానికి కేవలం మెడిసిన్సే అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. మనం తినే ఆహారం కూడా డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుందని చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్థాల్లో వంకాయ అద్భుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గత దశాబ్ద కాలంలో మధుమేహం వచ్చే ప్రమాదం చాలా వేగంగా పెరుగుతోంది. మధుమేహంలో టైప్-1, టైప్-2, గర్భధారణ మధుమేహం, ప్రీడయాబెటిస్ అనే నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి. వీటిలో టైప్-2 అత్యంత ప్రమాదకరమైన రకంగా పరిగణించబడుతుంది. ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలు టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో సర్వసాధారణంగా భావించబడుతున్నాయి. ఇది కాలక్రమేణా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. డయాబెటిక్ రోగులు అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అయితే, డయాబెటిక్‌ను కంట్రోల్ చేసే అద్భుత గుణాలు వంకాయలో ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం లక్షణాలు.. తరచుగా దాహం వేయడం, మూత్రవిసర్జన సమస్యలు తలెత్తుతాయి. దీన్నే పాలీయూరియా అంటారు. అలాగే అకస్మాత్తుగా బరువు తగ్గడం, త్వరగా అలసిపోయిన అనుభూతి కలుగుతుంది. స్త్రీలలో ఈ లక్షణాలు మరొక విధంగా కనిపిస్తాయి. ఆకలి వేయడం, యోని ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి.
వంకాయలో పోషకాలు.. డయాబెటిక్ పేషెంట్లకు వంకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి పనిచేస్తుంది. పిండి పదార్థాలు లేని కూరగాయ కావడంతో.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు.. బెండకాయ కొలెస్ట్రాల్ ఫ్రీ కూరగాయ. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇతర కార్బ్-రిచ్ ఫుడ్స్‌తో పోలిస్తే తక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులు దీనిని తినవచ్చు.
గుండె జబ్బుల నుంచి సంరక్షణ.. మధుమేహ వ్యాధిగ్రస్తులు వంకాయను తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణం పెరుగుతుంది. యాంటీ-ఆక్సిడెంట్ల సహాయంతో, శరీరం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఈ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
Also read: