Health Care Tips: శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా? లేని ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే..!
Health Care Tips: డ్రై ఫ్రూట్స్ సహజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతీ రోజూ కొంత పరిమాణంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు, ఆహార నిపుణులు సూచిస్తుంటారు.
Health Care Tips: డ్రై ఫ్రూట్స్ సహజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతీ రోజూ కొంత పరిమాణంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు, ఆహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే లేని ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుందంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ వల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెబుతున్నారు. వాస్తవానికి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌లో వివిధ గుణాలు ఉంటాయి. అందుకే ఈ కాలంలో వేటిని తినాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. డ్రై ఫ్రూట్స్ తినొచ్చు కానీ.. మితిమీరి తింటే హానీ కలిగిస్తాయట. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఊబకాయం.. డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని అంటున్నారు. అయితే, బరువు తగ్గడానికి వాటిని ఎలా తినాలో తెలుసుకోవడం కూడా ముఖ్యం. మీరు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటే అది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ అధికంగా తింటే ఊబకాయం సమస్య తలెత్తుతుంది.
చక్కెర స్థాయిని పెంచుతుంది.. డ్రై ఫ్రూట్స్‌లో షుగర్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తింటే.. వాటిలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో పెరుగుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి ఎక్కువవుతుంది.
అతిసారం.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల ఉదర సమస్యలు పెరుగుతాయి. డయేరియా వంటి తీవ్రమైన వ్యాధులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
అజీర్తి సమస్యలు.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అజీర్తి, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడుతాయి.
పంటి నొప్పి.. డ్రై ఫ్రూట్స్ నుండి వచ్చే చక్కెర కూడా దంతాలలో నొప్పి కలిగిస్తుంది. దంతాల్లో పుప్పిళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
డీహైడ్రేట్.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే నీరు వాటిని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని కారణంగా డీహైడ్రేట్ సమస్య ఏర్పడుతుంది. అది కాస్తా మలబద్ధకం సమస్యకు దారి తీస్తుంది. అందుకే డ్రై ఫ్రూట్స్‌ని అధికంగా తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: