Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hiccups: మీకు పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా..? తగ్గిపోయేందుకు ఈ చిట్కాలు పాటించండి..!

Hiccups: చాలా మందికి నిత్యం ఎక్కిళ్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఎక్కిళ్లు ఏ మాత్రం తగ్గకుండా ఏకధాటిగా వస్తూనే ఉంటాయి. దీని వల్ల కొందరు చాలా ఇబ్బందులకు..

Hiccups: మీకు పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా..? తగ్గిపోయేందుకు ఈ చిట్కాలు పాటించండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 21, 2021 | 12:38 PM

Hiccups: చాలా మందికి నిత్యం ఎక్కిళ్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఎక్కిళ్లు ఏ మాత్రం తగ్గకుండా ఏకధాటిగా వస్తూనే ఉంటాయి. దీని వల్ల కొందరు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఎక్కిళ్లు ఆగిపోయేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఆగవు. కొన్ని కొన్ని సార్లు వెంటనే తగ్గిపోతాయి.. కానీ కొన్ని సార్లు తగ్గకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

వైద్య భాషలో చెప్పాలంటో ఎక్కిళ్లను కొన్ని సార్లు సింగిలల్డస్‌ లేదా సింక్రోనస్‌ డయాఫ్రాగ్మాటిక్ అని పిలుస్తారు. డయాఫ్రాగమ్ బాహ్య ఇంటర్‌కోస్టల్ కండరాలు అకస్మాత్తుగా అసంకల్పితంగా సంకోచించినప్పుడు ఎక్కిళ్ళు వస్తుంటాయి. దీనివల్ల వేగంగా పీల్చవచ్చు. ఒక సెకను తరువాత, స్వరం మూత పడి వాయు ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. వెంటనే ధ్వని రూపంలో వినిపిస్తుంది. అయితే దీనికి స్పష్టమైన కారణం లేకపోయినా.. ఎక్కిళ్లు ఆగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. ఎక్కిళ్ళు కొన్నిసార్లు అకస్మాత్తుగా ప్రారంభమైనప్పటికీ, సాధారణంగా తినేటప్పుడు లేదా చాలా త్వరగా తాగే సమయంలో మాత్రమే వస్తుంటాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు ఎక్కిళ్ళు అందరిలోనూ వస్తుంటాయి. కొందరికైతే పదేపదే ఇబ్బందులకు గురి చేస్తుంటాయి.

ఇంట్లోనే  రెండు పద్ధతులు: శ్వాస తీసుకోండి.. శ్వాసను సుమారు 10 సెకన్ల పాటు గట్టిగా బిగపట్టండి. ఆ తరువాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించండి. ఇలా మూడు లేదా నాలుగు సార్లు చేయండి. ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. 20 నిమిషాల తరువాత మళ్లీ అలానే చేయండి. ఓ కాగితపు సంచిలో ఊపిరి పీల్చుకోండి. తినడం, తాగటం సమయంలోనూ ఎక్కిళ్లు వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు ఎక్కిళ్లను ఎలా తగ్గించుకోవాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

► ఐస్ వాటర్ పుక్కిలించాలి. ► చల్లటి నీటిని నెమ్మదిగా పీల్చుతూ తాగండి. ► నాలుకపై నిమ్మకాయ ముక్కను ఉంచి తీపిలాగా నాకండి.. ► మీ నాలుకపై ఒక చిటికెడు గ్రాన్యులేటెడ్ షుగర్ ఉంచండి. 5 నుండి 10 సెకన్ల వరకు ఉంచి దానిని మింగండి. మీ డయాఫ్రాగమ్‌ను ఒకే సమయంలో మింగడం చేయాలి..ఎక్కిళ్ళను తగ్గించడానికి కొన్ని ప్రెజర్ పాయింట్లను యాక్టివేట్ చేయవచ్చు.

48 గంటలకు మించి ఎక్కిళ్లు వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంపద్రించాల్సి ఉంటుంది. పెద్దవారిలో నిరంతర ఎక్కిళ్ళకు ఒక నిర్దిష్ట చికిత్స లేదు. నిరంతర ఎక్కిళ్ళు వచ్చేవారిలో ఏ చికిత్సలు హానికరంగా ఉంటాయో గుర్తించడానికి అధ్యయనాల అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎక్కిళ్లు కొన్ని సార్లు అకస్మాత్తుగా ప్రారంభమైనప్పటికీ, సాధారణంగా తినేటప్పుడు లేదా చాలా త్వరగా తాగేసమయంలో మాత్రమే వస్తుంటాయి. పిల్లలు నుంచి పెద్దల వరకు ఎక్కిళ్ళు అందరిలోనూ ఎక్కిళ్లు వస్తుంటాయి. అల్ట్రాసౌండ్ స్కాన్ల ప్రకారం.. వాస్తవానికి, 8 వారాల వయస్సు గల పిండాల్లో కూడా ఎక్కిళ్ళు వస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

Bone Weakness: బలహీనంగా ఉన్న ఎముకలను దృఢంగా మారాలంటే ఈ పదార్థాలను తీసుకోవాల్సిందే..!

Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్కువగా వీరికే సోకుతుంది.. తాజా పరిశోధనలో వెల్లడి..!