AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనవసరంగా భయపడుతున్నారా..? టెన్షన్ పడుతున్నారా..? దీనికి కారణాలేంటో తెలుసా..?

మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అయితే వాటిపై మనం స్పందించే విధానం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని సంఘటనలు కొందరిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా Anxiety అనేది మన ఆరోగ్యంపై దీర్ఘకాలం ప్రభావం చూపిస్తుంది. ఇది ఒత్తిడి భయం లాంటిది కాదు.. కానీ మనం ఊహించని సమస్యలపై ముందుగానే ఆందోళన పడే పరిస్థితి.

అనవసరంగా భయపడుతున్నారా..? టెన్షన్ పడుతున్నారా..? దీనికి కారణాలేంటో తెలుసా..?
Understanding Anxiety
Prashanthi V
|

Updated on: Jun 26, 2025 | 4:19 PM

Share

ఉదాహరణకు మీరు ఒక గదిలో పాము ఉందని ఊహించుకుని భయపడటం భయం. అదే గదిలో పాము వస్తే ఏమవుతుందో అని ముందే భయపడటం Anxiety. ఈ ఆలోచనలు కొన్నిసార్లు మన సాధారణ జీవితాన్ని మార్చేంత తీవ్రంగా మారతాయి. నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం, భవిష్యత్తుపై ఆందోళన, ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

Generalized Anxiety Disorder.. మనిషికి ఏ పని మొదలుపెట్టినా ఇది సరిగా జరగదేమో, ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురవుతారేమో, నాకు ఏదైనా జరిగిపోతుందేమో అనే ఆందోళన ఉంటుంది. రోజువారీ పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది. నిద్ర పట్టకపోవడం, ఇతరులతో సంబంధాలు తగ్గడం లాంటివి కనిపిస్తాయి. ఇది ఒక మానసిక స్థితిగా గుర్తించి సైకాలజిస్టు సలహాతో తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

Panic Attack.. అకస్మాత్తుగా తీవ్ర భయం ఆవరించి ఊపిరాడకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్లు చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇది గుండెపోటు అనిపించి ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీని వెనుక అసలు కారణం మానసిక ఒత్తిడే. ఇది ప్రయాణంలో, కొత్త చోటుకెళ్లినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు జరగవచ్చు.

Obsessive Compulsive Disorder (OCD).. ఒక పనిని పదే పదే చేయడం, చేతులు నిత్యం కడగడం, తలుపులు లాక్ చేశామా లేదా అని పదే పదే చెక్ చేసుకోవడం OCD లక్షణాలు. వీటిని లైట్ గా తీసుకోవద్దు. నిజానికి ఇది తీవ్రమైన మానసిక రుగ్మత. ఇంట్లో పదునైన వస్తువుల వల్ల పిల్లలకు ప్రమాదం జరుగుతుందేమోనని భయంతో దాచేయడం. బాగా ప్రేమించే పిల్లలపై కూడా అనుకోని ఆలోచనలు రావడం. ఇవన్నీ OCDలో భాగం.

Social phobia.. ప్రజల్లోకి వెళ్లాలంటే భయం, ఎవరైనా మన గురించి విమర్శిస్తారేమో అన్న భయం ఉండటం.. ఇది సోషల్ Anxiety లక్షణం. ఇటువంటి వారు ఫంక్షన్లు, సమావేశాలు వంటివి తప్పించుకోవాలని అనుకుంటారు. తమను తాము తక్కువగా భావించే భావన వారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య కూడా సైకలాజికల్ థెరపీతో తగ్గించుకోవచ్చు.

ఈ మానసిక సమస్యలన్నీ నివారించదగ్గవే. ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) వంటి చికిత్సలు మంచి ఫలితాలు ఇస్తాయి. సైకాలజిస్టు సహాయంతో ఈ చికిత్సలు కొనసాగిస్తే.. మళ్లీ ఆత్మవిశ్వాసంతో జీవితం గడపవచ్చు.

ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా.. మానసిక నిపుణులను సంప్రదించడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇవి చిన్నగా మొదలై తీవ్ర ప్రభావాలను చూపగల ప్రమాదం ఉంది. ముందే జాగ్రత్త పడితే మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)