Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఎక్కువ సేపు స్క్రీన్ కు అతుక్కుపోతూ..డార్క్​ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈచిట్కాలతో చెక్ పెట్టేయండి..

నేటి యువత ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ చూసినా ఫోన్ చూస్తూ ఉంటుంటారు. ఇంట్లో తిట్టినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తూ.. ఫోన్ స్క్రీన్ కు..

Health Tips: ఎక్కువ సేపు స్క్రీన్ కు అతుక్కుపోతూ..డార్క్​ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈచిట్కాలతో చెక్ పెట్టేయండి..
Dark Circles
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 01, 2022 | 8:21 AM

Health Tips: నేటి యువత ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ చూసినా ఫోన్ చూస్తూ ఉంటుంటారు. ఇంట్లో తిట్టినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తూ.. ఫోన్ స్క్రీన్ కు అంకితమైపోతారు. దాని ద్వారా కళ్లపై ఒత్తిడి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈమధ్య కాలంలో కంప్యూటర్ లేదా ఫోన్, ల్యాప్ టాప్ స్క్రీన్ లపై ఎక్కువ సేపు గడపడం ద్వారా యువత చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడటం, చిన్న వయస్సులోనే కళ్లద్దాలు పెట్టుకోవడం వంటివి చూస్తున్నాం. స్క్రీన్ పై ఎక్కువ సేపు గడిపినా, సరైన నిద్ర లేకపోయినా.. కంటి కింద క్యారీబ్యాగ్స్, డార్క్ సర్కిల్స్ వస్తాయి. నేటి ఆధునిక యుగంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈసమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు అవెంటో తెలుసుకుందాం. డార్క్ సర్కిల్స్ సమస్యతో ఎక్కువ యువత ఇబ్బంది పడుతూ ఉంటారు. లేట్​ నైట్​లో చాటింగ్స్ లేకుంటే ఓటీటీ ప్లాట్ ఫాంలలో మూవీలు చూస్తూ.. నిద్రను నిర్లక్ష్యం చేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల ఏర్పడే అలసట.. చర్మాన్ని నిస్తేజంగా మార్చుతుంది. దీంతో ముఖంపై డార్క్​ సర్కిల్స్​ఏర్పడతాయి. ఎక్కువగా డ్రింక్ చేసే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఈడార్క్ సర్కిల్స్ సమస్య నివారణకు ఏం చేయాల్లో తెలుసుకుందాం.

కోల్డ్ కంప్రెస్: ఉదయం లేదా సాయంత్రం.. సుమారు పది నిమిషాలు ఐస్​క్యూబ్స్​తో కళ్లను మసాజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్​గా చర్మం మీద కాకుండా.. కాటన్ క్లాత్​లో చుట్టి.. మెల్లిగా కళ్లను మసాజ్ చేయాలి. మీకు ఐ మాస్క్ ఉంటే.. మీరు దానిని కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి కళ్లకు పెట్టుకోవచ్చు.

చల్లని టీ బ్యాగులు: మీరు ఉపయోగించడానికి కోల్డ్ కంప్రెస్ లేదా మాస్క్ లేకుంటే.. ఉపయోగించిన టీ బ్యాగ్‌లు మీకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. గ్రీన్ టీ వంటి అనేక టీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఇవి మీ కళ్లకింద ఉండే క్యారీబ్యాగ్స్​ను, డార్క్ సర్కిళ్లను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

కీరదోసకాయ: కీరదోసకాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులోని అధిక నీటి కంటెంట్ కంటి కింద వాపు, నల్లటి వలయాలను తగ్గిస్తుంది. తాజా కీరదోసకాయను మందపాటి ముక్కలుగా కోసి.. ఆపై 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. ఈ దోసకాయ ముక్కలను మీ కళ్లపై ఉంచి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

బాదం నూనె: బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమాన్ని కాలక్రమేణా ఉపయోగిస్తే నల్లటి వలయాలకు సహజ నివారణ కావచ్చు. పడుకునే ముందు మీ డార్క్ సర్కిల్స్​ను బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమంతో కలిపి మసాజ్ చేయండి. ఉదయం లేచిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

చల్లని పాలు: పాల ఉత్పత్తులు విటమిన్-ఎను కలిగి ఉంటాయి. ఇందులో రెటినోయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచడంలో గొప్పగా పనిచేస్తాయి. చల్లని పాల గిన్నెలో కాటన్ మేకప్ రిమూవర్ ప్యాడ్‌ను నానబెట్టండి. అనంతరం 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే.. డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది.

నిద్రపోవాలి: నిర్ణీత సమయం పడుకోకపోవడం వల్ల కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది. కాబట్టి నిద్ర దినచర్యను మార్చుకోవాల్సి రావచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎక్కువ నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ సహజ నివారణలతో డార్క్ సర్కిళ్ల సమస్యను పూర్తిగా నివారించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..