AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga: తిన్నది అరగడం లేదా.. ఇలా చేయండి.. వెంటనే ఫలితం కనిపిస్తుంది.

ఏం తిన్నా అరగడం లేదు. కడుపు ఉబ్బరంగా ఉంటుందనే సమస్య చాలామందిలో చూస్తాం. వ్యక్తిలోని జీర్ణవ్యవస్థ పనితీరుపై ఇది ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎలాంటి ఆహారం తీసుకున్నా..

Yoga: తిన్నది అరగడం లేదా.. ఇలా చేయండి.. వెంటనే ఫలితం కనిపిస్తుంది.
Vajrasan
Amarnadh Daneti
|

Updated on: Sep 01, 2022 | 7:55 AM

Share

Yoga For Digestive Health: ఏం తిన్నా అరగడం లేదు. కడుపు ఉబ్బరంగా ఉంటుందనే సమస్య చాలామందిలో చూస్తాం. వ్యక్తిలోని జీర్ణవ్యవస్థ పనితీరుపై ఇది ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇట్టే అరిగిపోతుంది. మరికొంతమంది లైట్ ఫుడ్ తీసుకున్నా అరుగుదల సమస్యతో బాధపడుతూ ఉంటారు. తిన్నది జీర్ణం కావడానికి భోజనం చేసిన తర్వాత కొన్ని ఆసనాలు వేస్తే.. సమస్య ఇట్టే పరిష్కారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా తిన్న వెంటనే శరీరాన్ని శ్రమ పెట్టే పనులు చేయకూడదు.. తిన్న వెంటనే ఆసనాలు వేయకూడదని చాలా మంది చెప్తారు. కాని తిన్న తర్వాత కొన్ని రకాల ఆసనాలు వేస్తే.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి.. తిన్నది వెంటనే అరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువుగా తినడం, సరైన డైట్ ను పాటించకపోవడం వల్ల అరుగుదల సమస్య వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. ఇవి వికారం, నిద్రలేమికి కూడా కారణమవుతాయి. చివరకి బరువు పెరగడానికి దారితీయవచ్చు. భోజనం చేసిన తర్వాత కొన్ని యోగా ఆసనాలు చేస్తే.. మెరుగైన జీర్ణక్రియ, ప్రశాంతమైన నిద్ర, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు యోగా నిపుణులు.

భోజనం తర్వాత చేయాల్సిన యోగసనాలు

ఇవి కూడా చదవండి

వజ్రాసనం: మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా ఏదైనా తిన్న తర్వాత వజ్రాసనం చేయడం ద్వారా తిన్నది త్వరగా జీర్ణమవుతుంది. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈఆసనం చేయడం ద్వారా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

సుప్త బద్ధ కోణాసనం: ఈ ఆసనం ద్వారా శరీరం లోపలి తొడలు, మోకాళ్లను సాగదీస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను పెంచడం ద్వారా జీర్ణక్రియను సక్రియం చేస్తుంది. ఇది అలసట, నిద్రలేమి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఊర్ధ్వ ప్రసారిత పద్మాసన: ఈ ఆసనం చేయడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఈఆసనం కండరాలను బలపరుస్తుంది. వెన్నెముకను సాగదీసి శక్తినిస్తుంది. కాలేయం, మూత్రపిండాలను ప్రేరేపిస్తుంది. అవయవాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది.

మార్జాలాసనం: ఈ ఆసనం తుంటి, వీపు, పొత్తికడుపులోని కండరాలను సాగదీస్తుంది. అంతేకాక ఇది జీర్ణశయాంతర ప్రేగులతో సహా అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.

తడాసానం: తిన్న తర్వాత చేయడానికి ఇది ఉత్తమమైన ఆసనం. కడుపు నిండా తిన్నా సరే దీనిని నిర్భయంగా చేయవచ్చు. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ