AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: కిడ్నీలో రాళ్లు వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా సమస్య నుంచి బయటపడాలా.. అయితే ఈ చిట్కాలు పాటించేయండి..

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ (Kidney) ఒకటి. శరీరంలో చేరుకునే ఆహారాన్ని ఫిల్టర్ చేసి, ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి పనితీరు బాగుంటేనే ఇతర అవయవాలు...

Kidney Health: కిడ్నీలో రాళ్లు వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా సమస్య నుంచి బయటపడాలా.. అయితే ఈ చిట్కాలు పాటించేయండి..
Kidney
Ganesh Mudavath
|

Updated on: Sep 01, 2022 | 7:32 AM

Share

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ (Kidney) ఒకటి. శరీరంలో చేరుకునే ఆహారాన్ని ఫిల్టర్ చేసి, ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి పనితీరు బాగుంటేనే ఇతర అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. మన శరీరంలో వ్యర్థాలను వడగట్టడంలో కిడ్నీలకు రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కిడ్నీలో రాళ్ల గురించి. ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. యూరిన్‌లో లిక్విడ్‌, సాలిడ్‌ కంపోనెంట్స్‌ రెండూ ఉంటాయి. సాలిడ్‌ కంపోనెంట్‌లో సోడియం, పొటాషియం, యూరిక్‌ యాసిడ్‌, కాల్షియంతో పాటు రకరకాల పదార్థాలుంటాయి. ఇవి యూరిన్ లో కరగకుండా ఉంటే అవి చిన్న చిన్న రేణువులుగా మారతాయి. మంచినీళ్లు తాగకుండా ఉండే సరికి అవి మరింత పెద్దగా మారి రాళ్లుగా తయారవుతాయి. సాధారణంగా ఆక్జలేట్‌ లేదా ఫాస్ఫరస్‌లతో క్యాల్షియం కలవటం వల్ల రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. నీరు సరిగ్గా తకకపోయినా, అధిక బరువు, డయాబెటిస్‌ సమస్య ఉన్నవారికి, శారీరక శ్రమ లేకపోయినా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. శరీరంలో విటమిన్‌ బీ6, సీ లోపం, విటమిన్‌ డి అధికంగా ఉన్నా ఈ సమస్య వస్తుంది. మద్యం తాగే అలవాటు, కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్లు వస్తున్నా, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు ఏర్పడతాయి.

ఆలివ్‌ ఆయిల్, నిమ్మరసం కాంబినేషన్‌ కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. ఈ మేరకు హార్వర్డ్ హెల్త్ నివేదిక వెల్లడించింది. కిడ్నీ స్టోన్స్‌ ఉన్నవారు ఆ సమస్య తగ్గేవరకు ఈ కాంబినేషన్ తాగితే మంచిది. నిమ్మరసం రాళ్లను విచ్ఛిన్నం చేస్తే, ఆలివ్ ఆయిల్ రాళ్లు బయటకు వెళ్లేందుకు లూంబ్రికెంట్ గా పని చేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలు శుభ్రంగా మారతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజూ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి కిడ్నీలో రాళ్లను బయటకు పంపిస్తాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు