డైలీ ఉదయాన్నే ఇలా చేస్తే కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే.. నెల రోజుల్లోనే మార్పు కనిపిస్తుందట..!

కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అందుకే.. శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు ఇప్పటినుంచే.. జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలామంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్..

డైలీ ఉదయాన్నే ఇలా చేస్తే కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే.. నెల రోజుల్లోనే మార్పు కనిపిస్తుందట..!
Cholesterol
Follow us

|

Updated on: Aug 17, 2024 | 2:29 PM

కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అందుకే.. శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు ఇప్పటినుంచే.. జీవనశైలిని.. ఆహారాన్ని మార్చుకోవడం చాలామంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్.. కొలెస్ట్రాల్ అనేది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది.. ఇది రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు మరింత కారణమవుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ రెండు రకాలు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ 50mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎల్లప్పుడూ 100 mg/dL కంటే తక్కువగా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం..

హై కొలెస్ట్రాల్ కారణంగా గుండె సంబంధిత సమస్యలతో పాటు.. అనేకసమస్యలు వచ్చే ప్రమాదముంది.. కావున చెడు కొలెస్ట్రాల్ స్థాయిని సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆహారాలను.. మీ రోజువారీ అల్పాహారంలో చేర్చుకోవడం చాలామంచిది.. తద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉదయాన్నే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకోండి..

వాల్‌నట్‌లను తినండి: ప్రతిరోజూ మీ అల్పాహారంలో కొన్ని వాల్‌నట్‌లను తినండి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బాదం: బాదం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఉదయాన్నే పరగడుపున బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆలివ్ నూనెతో ఆహారం తయారు చేసుకోండి: ఆలివ్ నూనెతో వంట చేయడం చాలా మంచిది. ఈ నూనె మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. కావున అల్పాహారం ఆలివ్ నూనెతో తయారు చేసుకుని తినండి.

అల్పాహారంలో అవిసె గింజలను తినండి: అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అవిసె గింజల పొడిని వరుసగా 3 నెలల పాటు ఉదయం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

మార్నింగ్ వాక్: మార్నింగ్ వాక్ రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను 5 శాతం పెంచుతుంది.

ఆరెంజ్ జ్యూస్: ఉదయం పూట ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. నారింజలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. 750 మి.లీ నారింజ రసాన్ని ఉదయం పూట 4 వారాల పాటు నిరంతరం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

ఒక నెల పాటు ఉదయాన్నే అల్పాహారంలో మార్పులు చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుందని.. అధిక బరువు సమస్య కూడా అదుపులో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఫాలో అయ్యేముందు డైటీషియన్లను సంపద్రించండి)

డైలీ ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరగాల్సిందే..
డైలీ ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరగాల్సిందే..
రూ.50కోట్లు అందుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్..
రూ.50కోట్లు అందుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్..
గవర్నర్‌ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేయనున్న సిద్ధరామయ్య
గవర్నర్‌ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేయనున్న సిద్ధరామయ్య
అఫీషియల్.. ప్రభాస్ కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. ప్రభాస్ కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
పెట్ డాగ్‌ను వెంటాడిన ఎలుగుబంటి.. ఆ మహిళ ఏం చేసిందంటే..?
పెట్ డాగ్‌ను వెంటాడిన ఎలుగుబంటి.. ఆ మహిళ ఏం చేసిందంటే..?
తెలంగాణ యాసలో వెరైటీ పెళ్లి కార్డు.. సోషల్‌ మీడియాలో వైరల్‌
తెలంగాణ యాసలో వెరైటీ పెళ్లి కార్డు.. సోషల్‌ మీడియాలో వైరల్‌
నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ధనుష్
నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ధనుష్
గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు హెవీ రెయిన్ అలర్ట్...
ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు హెవీ రెయిన్ అలర్ట్...
టీమిండియా దిగ్గజానికే తలొగ్గని 5 ప్రపంచ రికార్డులు.. అవేంటంటే?
టీమిండియా దిగ్గజానికే తలొగ్గని 5 ప్రపంచ రికార్డులు.. అవేంటంటే?
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్