AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ 20 నిమిషాలే.. మీ జీవితాన్నే మార్చేస్తుంది.. రాత్రి భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే..

ఉరుకులు పరుగుల జీవితం.. ఎన్నో సమస్యలు.. పని ఒత్తిడి.. ఇలా ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది.. చాలామందికి డే టైమ్ లో అస్సలు ఖాళీ దొరకదు.. అలాంటప్పుడు రాత్రి పూట భోజనం చేసిన తర్వాత .. కాసేపు నడిస్తే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జస్ట్ 20 నిమిషాలే.. మీ జీవితాన్నే మార్చేస్తుంది.. రాత్రి భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే..
Health Tips
Shaik Madar Saheb
|

Updated on: Aug 17, 2024 | 1:41 PM

Share

ఉరుకులు పరుగుల జీవితం.. ఎన్నో సమస్యలు.. పని ఒత్తిడి.. ఇలా ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటుంది.. చాలామందికి డే టైమ్ లో అస్సలు ఖాళీ దొరకదు.. అలాంటప్పుడు రాత్రి పూట భోజనం చేసిన తర్వాత .. కాసేపు నడిస్తే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పనిచేసి వచ్చి అలసిపోతాము.. ఈ క్రమంలో రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతాము. కానీ.. రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రి భోజనం తర్వాత నడవడం అనేది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే.. రాత్రి భోజనం చేసిన తర్వాత ఎంత సేపటికి నడక ప్రారంభించాలి.. ఎంత సమయం వరకు వాకింగ్ చేయాలి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భోజనం తర్వాత ఎప్పుడు నడక ప్రారంభించాలి..

వాస్తవానికి ఈ చిన్న అలవాటులో ఎంతో శక్తి దాగి ఉందని వైద్య నిపునులు పేర్కొంటున్నారు. సాధారణంగా, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 20 నిమిషాల తర్వాత నడక ప్రారంభించాలి. 20 నుంచి 40 నిమిషాల వరకు నడవాలి.. ఇంతకంటే ఎక్కువ దూరం నడవవచ్చు కానీ గంటలోపు నడవడం ఉత్తమం..

రాత్రిపూట నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: రాత్రిపూట నడవడం జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది. దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: రాత్రిపూట నడవడం వల్ల కేలరీలు కరిగిపోతాయి.. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మంచి నిద్ర: రాత్రిపూట నడవడం వల్ల శరీరం అలసిపోతుంది, కాబట్టి మీరు రాత్రి బాగా నిద్రపోవచ్చు.

ఒత్తిడిని తగ్గిస్తుంది: రాత్రిపూట నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

గుండె ఆరోగ్యం: రెగ్యులర్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెరుగైన మానసిక స్థితి: రాత్రిపూట నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రాత్రిపూట ఇలా నడకను ప్రారంభించండి..

తేలికపాటి ఆహారం: రాత్రి భోజనం తేలికగా, పోషకమైనదిగా ఉండాలి. భారీగా తినడం.. వేయించిన ఆహారాన్ని నివారించండి.

నెమ్మదిగా నడవండి: వేగంగా నడవడానికి బదులుగా, నెమ్మదిగా నడవండి.

సౌకర్యవంతమైన దుస్తులు: సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి.. తద్వారా మీరు సులభంగా కదలవచ్చు.

సురక్షితమైన ప్రదేశం: ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశంలో నడవండి. ట్రాఫిక్ ఉండే ప్రాంతాలలో.. రోడ్లపై నడవకండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి