అసలేమిటీ మంకీ పాక్స్…? ఎలా వస్తుంది..? లక్షణాలేంటి.. ? WHO ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది..?

కరోనా తర్వాత అంతటి డేంజరస్‌ మహమ్మారి ఎంపాక్స్‌ రూపంలో మానవాళికి ముప్పుగా పరిణమించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఎంపాక్స్ గా వ్యవహరించే మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

అసలేమిటీ మంకీ పాక్స్...? ఎలా వస్తుంది..? లక్షణాలేంటి.. ? WHO ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది..?
Monkey Pox
Follow us

| Edited By: Ravi Panangapalli

Updated on: Aug 17, 2024 | 2:46 PM

కరోనా మహమ్మారి నుంచి ఇంకా తేరుకోకముందే… కొత్త కొత్త వైరస్‌లు దడ పుట్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాణాంతకమైన ఎబోలా, నిపా, మలేరియా, డెంగీ, జైకా, ఎయిడ్స్‌, ఏవియన్ ఫ్లూ, వైరల్ హెపటైటిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, టొమాటో ఫ్లూ వంటి వైరస్‌లు ఒకదాని వెనుక మరొకటి మనుషులపై దాడి చేస్తున్నాయి. ప్రాణాలు హరిస్తున్నాయి. ఈ వైరస్‌లు చాలవా అన్నట్లు కొద్ది రోజులుగా మరో వైరస్‌ దడ పుట్టిస్తోంది. అదే.. మంకీ వైరస్‌. శాస్త్రవేత్తలు దీనిని ఎంపాక్స్‌గా వ్యవహరిస్తున్నారు.

కరోనా తర్వాత అంతటి డేంజరస్‌ మహమ్మారి ఎంపాక్స్‌ రూపంలో మానవాళికి ముప్పుగా పరిణమించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఎంపాక్స్ గా వ్యవహరించే మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తొలుత ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా పాకుతుందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు హరీ అనడం ఖాయమని డబ్ల్యూహెచ్‌వో అలర్ట్‌ జారీ చేసింది. గతంలోనే ఎంపాక్స్‌ వైరస్‌ వెలుగు చూసినా ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్థాన్‌లోనూ ఎంపాక్స్‌ కేసులు గుర్తించనట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం.

ఏమిటీ ఎంపాక్స్ వైరస్‌..?

ఎంపాక్స్‌గా వ్యవహరించే మంకీపాక్స్ వైరస్‌ సోకిన మనుషుల శరీరంపై అమ్మవారు సొకినట్లు స్మాల్‌పాక్స్‌ లక్షణాలతో చిన్న చిన్న పొక్కులు కనిపిస్తాయి. తొలుత ఆఫ్రికా ఖండంలో 1958లో ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చింది. మొట్టమొదటగా జంతువులు వాటి ద్వారా మనుషులకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతూ వచ్చింది. కోతుల వంటి బుష్‌ ఎనిమల్స్‌ల్లో ఈ వైరస్‌ తొలుత గుర్తించారు. వాటి నుంచి ఇతర జంతువులకు సోకింది.

Monkey Pox Death Rate

Monkey Pox Death Rate

ఎంపాక్ష్‌ వైరస్ వెలుగచూసిన తొలి రోజుల్లో ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే మనుషులకు మాత్రమే పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వైరస్ బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ కొన్ని కేసులు నమోదయ్యాయి. చాలా వరకు జంతువులు, వాటి మాంసం కారణంగానే వైరస్ వ్యాపించింది తప్ప మనుషుల నుంచి మనుషులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు.

ఆఫ్రికా అతలాకుతలం

ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన ఎంపాక్స్‌ వైరస్‌ ప్రస్తుతం ఆఫ్రికాలోని 13 దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం ఆఫ్రికాలోని 95 శాతం కేసులు కేవలం కాంగోలో మాత్రమే బయటపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న దేశాలకు సైతం అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తున్నది. కరోనాలో కొత్త వేరియట్లు పుట్టుకొచ్చిన మాదిరిగానే ఎంపాక్స్‌లోనూ కొత్త వేరియంట్స్‌ మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అదేస్థాయిలో మరణాల రేటు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఎంపాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీ కింద పరిగణించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఆఫ్రికాలో ఒక్క వారంలోనే 5 వందల మంది ఎంపాక్స్‌ బాధితులు మృతి చెందారు. వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఆఫ్రికాలో పరిమితంగా ఉండడం మరింత భయాందోళన రేకెత్తిస్తోంది. రోజురోజుకు మరణాలు పెరుగుతుండటంఓ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ అంతర్జాతీయ సహాయం అర్దిస్తోంది. గతేడాదితో పోలిస్తే 160 శాతం కేసులు, 19 శాతం మరణాలు అధికంగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటి వరకు 15 వేలకుపైగా కేసులు గుర్తించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

టీనేజ్‌ పిల్లలే టార్గెట్‌!

ఆఫ్రికాలో చిన్న పిల్లలే ముఖ్యంగా టీనేజ్‌ మీదనే ఎంపాక్స్‌ దాడి తీవ్రంగా ఉంది. అత్యధిక కేసులు పిల్లల్లోనే నమోదు అవుతుండటం వైరస్‌ పట్ల మరింత ఆందోళన కలిగిస్తుంది. కాంగోలో 70 నంచి 80 శాతం కేసులు చిన్న పిల్లల్లోనే వెలుగు చూస్తున్నాయి. 85 నుంచి 90 శాతం మరణాలు 18 సంవత్సరాల లోపు వారే ఉన్నారని ఆఫ్రికా సీడీసీ ప్రకటించింది. కాంగాలో శర వేగంగా వ్యాపిస్తున్న ఎంపాక్స్‌ కొత్త వేరియంట్‌తో మరణాలు రేటు దాదాపు 5 శాతం ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగోలో పిల్లల ప్రాణాలు రక్షించుకోవాలంటే నాలుగు మిలియన్‌ డోసుల ఎంపాక్స్‌ వ్యాక్సిన్‌ అవసరం ఉంది. ఆ మేరకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని కాంగో ప్రభుత్వం ప్రభుత్వం ప్రపంచ దేశాలను కోరింది. ఎక్కువగా 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా, జపాన్‌ దేశాలు వ్యాక్సిన్‌ అందిచేందుకు అంగీరించడం కాస్తా ఊరటనిచ్చే అంశం.

రెండేళ్ల కిందే మహమ్మారి విజృంభణ

ఎంపాక్స్‌ వైరస్‌ కొత్తగా వచ్చినదేమీ కాదు. 2022 లోనే విజృంభించింది. ఏకంగా 116 దేశాలలో ఎంపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. 2022 జూలై చివరి నాటికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులో వైరస్ వ్యాప్తి మరింత విజృంభించింది. వారానికి దాదాపుగా 7 వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష మందికి ఎంపాక్స్‌ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

శాస్త్రవేత్తల పరిశోదనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైరస్ వేగంగా వ్యాపించడానికి లైంగిక సంబంధాలే కారణంగా గుర్తించారు. అసహజ లైంగిక సంబంధాల వల్ల ఎంపాక్స్ వైరస్ వ్యాపిస్తోందని కనుగొన్నారు. వైరస్ బాధితులతో లైంగిక చర్యలో పాల్గొన్న వారికి ఎంపాక్స్ అంటుకుంటోందని రెండేళ్ల కిందే శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆ తర్వాత వైరస్‌లో మార్పులు, వ్యాక్సినేషన్ కారణంగా ఎంపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇప్పుడు వైరస్‌ విజృంభిస్తోంది.

మరింత ప్రమాదకారిగా పరివర్తనం

జన్యుపరంగా పరివర్తనం చెందడం వైరస్‌ ప్రధాన లక్షణం. కొన్ని వైరస్‌లు పుట్టుకతో బలహీనంగా ఉన్నా ఆ తర్వాత బలంగా మారి దాడి చేస్తుంటాయి. ఎంపాక్స్‌ కూడా రెండేళ్లతో పోల్చుకుంటే ప్రస్తుతం మరింత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ముఖ్యంగా కాంగో బేసిన్ స్ట్రెయిన్ గా వ్యవహరించే “CLADE-1 MPX V” రకం వైరస్ తో మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.

కాంగోలోని సౌత్ కీవూ ప్రావిన్స్ కేంద్రంగా ఎంపాక్స్‌ ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్నది. త్వరలోనే గ్లోబల్ పాండెమిక్‌గా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఈ వైరస్‌కు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే గుణం అధికం. దీంతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని, మరణాలు కూడా పెరుగుతాయని డబ్ల్యూహెచ్‌వో డేంజర్‌ బెల్స్‌ మోగించింది. ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, యాంటీ వైరల్ ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్‌ వంటి చర్యల ద్వారా వైరస్‌ను కట్టడి చేయొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Monkeypox

Monkeypox

స్వీడన్‌కు పాకిన వైరస్‌

ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ప్రమాదకర ఎంపాక్స్ కేసును గుర్తించినట్టు స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎంపాక్స్ తీవ్రంగా వ్యాపించడం…అంతర్జాతీయంగా ఆందోళన చెందాల్సిన విషయమని చెబుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ… ఆరోగ్య అత్యవసరపరిస్థితి ప్రకటించిన కొన్ని గంటలకే ఆఫ్రికా వెలుపల ఈ కేసు గుర్తించారు. ఆఫ్రికాకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా ఎంపాక్స్‌ స్వీడన్‌కు వ్యాపించింది. దీంతో స్వీడన్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

పొక్కులన్నీ మంకీపాక్స్‌ కాకపొవచ్చు

2020లో కరోనా రేపిన కల్లోలం చూశాక వైరస్‌ అంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. లేనిపోని భయాలతో బీపీ, షుగర్‌ వంటి రోగాల బారిన పడుతున్నారు. అయితే మంకీపాక్స్‌ ప్రధాన లక్షణం శరీరం మీద పొక్కులు. దీంతో ఇదిగో పులి అదిగో తోక మాదరిగా ఇదిగో పొక్కు అంటే అదిగో మంకీపాక్స్‌ అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. చర్మం మీద చిన్న పొక్కు మొలిచినా మంకీపాక్సేమో అని హడలిపోతున్నారు.

దద్దురు, పొక్కులు కనిపించగానే మంకీపాక్సేమో అనే అనుమానం నుంచి బయటపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అటలమ్మగా చెప్పుకునే చికెన్‌పాక్స్‌ వంటి వైరస్‌లోనూ శరీరంపై పొక్కులు, దద్దులు వస్తాయి. శరీరంపై సడెన్‌గా కనిపించే పొక్కులు, దద్దులు అన్నీ ఎంపాక్స్‌ వైరస్‌కు చెందినవి కాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. అనవసరమైన ఆందోళనతో ఇతర జబ్బుల బారిన పడొద్దని సూచిస్తున్నారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

All You Know

All You Know

లక్షణాలు, చికిత్స

ఎంపాక్స్‌ సోకిన వారిలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. చాలావరకు దానంతటదే తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రపంచం ముందు పెద్దగా కనిపిస్తున్నా కొత్తదేం కాదు. అన్ని చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ ఉపయోగపడుతుంది. పొక్కులు చీము పట్టే అవకాశముంది కాబట్టి యాంటీబయాటిక్స్‌ అవసరమవుతాయి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తినాలి. కొందరికి రక్తనాళం ద్వారా సెలైన్‌ ఎక్కించాల్సి రావొచ్చు.

సిడోఫోవిర్‌, టెకోవిరిమట్‌ యాంటీవైరల్‌ మందుల ద్వారా ఎంపాక్స్‌ నయం అయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. 600 మిల్లీగ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్ల చొప్పున రెండు వారాల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రిన్సిఫోఫోవిర్‌ మందునైతే 200 మి.గ్రా. మోతాదులో వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇమ్యునోగ్లోబులిన్లు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఏ చికిత్స అయినా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి తప్ప… ఇంటర్నెట్ సాయంతోనే, ఎవరో చెప్పారనో మందుల దుకాణాలకెళ్లి ఆయా మందులు తీసుకొని సొంతవైద్యం చేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు.

అయితే ఇవన్నీ సాధారణ ఎంపాక్స్‌ను నయం చేయడానికి పనికొస్తాయి. కానీ డబ్ల్యూహెచ్‌వో చెప్పే కొత్తరకం ఎంపాక్స్ మాత్రం ప్రాణాంతకమని చెప్పడంతో చికిత్స కన్నా ముందు జాగ్రత్త ఒక్కటే మార్గమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

ఆఫ్రికాను వణికిస్తున్న వ్యాధి.. ప్రపంచాన్ని చుట్టేస్తుందా?
ఆఫ్రికాను వణికిస్తున్న వ్యాధి.. ప్రపంచాన్ని చుట్టేస్తుందా?
డైలీ ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరగాల్సిందే..
డైలీ ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరగాల్సిందే..
రూ.50కోట్లు అందుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్..
రూ.50కోట్లు అందుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్..
గవర్నర్‌ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేయనున్న సిద్ధరామయ్య
గవర్నర్‌ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేయనున్న సిద్ధరామయ్య
అఫీషియల్.. ప్రభాస్ కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. ప్రభాస్ కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
పెట్ డాగ్‌ను వెంటాడిన ఎలుగుబంటి.. ఆ మహిళ ఏం చేసిందంటే..?
పెట్ డాగ్‌ను వెంటాడిన ఎలుగుబంటి.. ఆ మహిళ ఏం చేసిందంటే..?
తెలంగాణ యాసలో వెరైటీ పెళ్లి కార్డు.. సోషల్‌ మీడియాలో వైరల్‌
తెలంగాణ యాసలో వెరైటీ పెళ్లి కార్డు.. సోషల్‌ మీడియాలో వైరల్‌
నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ధనుష్
నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ధనుష్
గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు హెవీ రెయిన్ అలర్ట్...
ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు హెవీ రెయిన్ అలర్ట్...
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
ఇలాంటి ఘటనల మధ్య ఎలాంటి స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం.?
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
పండక్కి సెలవు అడిగితే ఉద్యోగం పీకేసారు.! యాజమాన్యం తీరు..
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
610 కేజీల మనిషి 60 కేజీలకు ఎలా తగ్గాడో తెలుసా.? అదిరిపోయే వీడియో.
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
విదేశీ పర్యాటకులకు శుభవార్త.. డిసెంబర్ నుండి కిమ్‌ ఆహ్వానం..!
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
చాయ్ Vs టీ.! మార్కెట్ లో పెరిగిపోతున్న డిమాండ్.. దేనికంటే.?
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
రాజేంద్ర ప్రసాద్ ఇలా ఉంటారా..? గుర్తు పట్టలేకపోయిన భక్తులు.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
బస్సు నడిపిన లెజెండ్‌.. మామూలుగా ఉండదు మరి బాలయ్యతోని.!
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
ఉత్తమ తెలుగు చిత్రంగా 'కార్తికేయ 2'కి జాతీయ అవార్డు..
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
హిట్టా.? ఫట్టా.? నార్నే నితిన్ సక్సెస్ అందుకున్నాడా.!
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ2|డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్