Neem: వేపతో ఇలా చేస్తే.. మీరు నమ్మలేని బెనిఫెట్స్.. ఇవిగో డీటేల్స్

వేప ఆకు నీళ్లతో స్నానం చేస్తే మొటిమల సమస్య తొలగిపోయి ముఖం మెరుస్తుంది. మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు, ముఖంపై ఏర్పడే తొలగించడంలో ఇది చాలా సహాయపడుతుంది. అందుకే వారానికి ఒక్కసారైనా స్నానం చేసే నీళ్లలో వేపను కలపండి.

Neem: వేపతో ఇలా చేస్తే.. మీరు నమ్మలేని బెనిఫెట్స్.. ఇవిగో డీటేల్స్
Neem Tree
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 17, 2024 | 1:20 PM

వేప ఆకు, బెరడు, పువ్వు, పండ్లు.. ఇలా అన్నింటిని అనేక రకాల ఔషధాలలో ఉపయోగిస్తారు. వేపలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా వేప చాలా సహాయపడుతుంది. వేప మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందుకే వేప నీళ్లతో స్నానం చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

మొటిమలు నుంచి విముక్తి:

వేప ఆకు నీళ్లతో స్నానం చేస్తే మొటిమల సమస్య తొలగిపోయి ముఖం మెరుస్తుంది. మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు, గుంతలు తొలగించడంలో చాలా సహాయపడుతుంది. వేప ఆకు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. వేప ఆకులను పేస్ట్‌లా చేసి 2 స్పూన్ల పెరుగుతో కలపండి. ఇది ముఖంపై రాస్తే.. నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 

కళ్ళకు ప్రయోజనాలు:

కంటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా మంట ఉంటే వేప ఆకు నీరు నయం చేస్తుంది. వేప ఆకు నీళ్లతో తలస్నానం చేసే సమయంలో కళ్లు కడుక్కుంటే ఇన్ఫెక్షన్, కళ్లు ఎర్రబడడం, కంటి వాపు వంటి సమస్యలు నయమవుతాయి. 

చుండ్రు ఉపశమనం:

చుండ్రు బాధితులకు కూడా వేప ఉపయోగపడుతుంది. వేప నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వారానికోసారి వేప లేదా వేప ఆకు నీటితో తల స్నానం చేస్తే చుండ్రు పోతుంది. వేప ఆకు నీటిని వాడేటప్పుడు షాంపూ వాడకపోవడమే మంచిది.

చెమట:

కొందరికి చెమట ఎక్కువ పడుతుంది.  చెమట వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం శరీరంలో ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియా. అలాంటి పరిస్థితుల్లో వేపపూతతో స్నానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చెమట దుర్వాసన పోతుంది.

(గమనిక : ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి